కశ్మీర్ ఫైల్స్ వివాదం: క్షమాపణ చెప్పిన సాయి పల్లవి..!
ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే నటి సాయి పల్లవి కొద్ది రోజులుగా ఒక వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో సాయి పల్లవి క్షమాపణలు కోరింది. దీనికి సంబంధించి ఒక వీడియో విడుదల చేసింది. సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి మాట్లాడే సందర్భంలో ‘ కశ్మీర్ పండిట్ల పై కొందరు […]
ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే నటి సాయి పల్లవి కొద్ది రోజులుగా ఒక వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో సాయి పల్లవి క్షమాపణలు కోరింది. దీనికి సంబంధించి ఒక వీడియో విడుదల చేసింది. సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి మాట్లాడే సందర్భంలో ‘ కశ్మీర్ పండిట్ల పై కొందరు ఆకృత్యాలకు పాల్పడడం నిజమే. కానీ మనదేశంలో గోవులను తరలిస్తున్నారని కొందరిపై దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు ఒకే తరహా దాడులు. వాటిని మనము సమర్థించలేము’ అని వ్యాఖ్యానించారు.
కాగా.. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి పై విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదం మరింత ముదురుతుండటంతో సాయి పల్లవి స్పందించింది. ఫేస్బుక్ వేదికగా ఒక వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చింది.
‘ఎవరినీ కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు. నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నా మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే.ఏ మతంలో అయినా హింస తప్పు అని గతంలో నేను ఒకసారి చెప్పా. ఒక డాక్టర్ గా నాకు ప్రాణం విలువ తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. కష్ట సమయంలోనూ నా వెంట నిలిచిన వారికి కృతజ్ఞతలు’ అని వీడియోలో సాయి పల్లవి పేర్కొంది.