తెలంగాణలో కొలువుల జాతర.. 10వేల పోస్ట్ ల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వం. కొత్తగా ఇప్పుడు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేట్ సెక్టార్ లో అయితే ఉద్యోగాల భర్తీ భారీ స్థాయిలో జరిగింది. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో.. తెలంగాణలో కొత్తగా 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ కొలువుల జాతర ఇక్కడితో ఆగిపోలేదు, […]
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వం. కొత్తగా ఇప్పుడు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేట్ సెక్టార్ లో అయితే ఉద్యోగాల భర్తీ భారీ స్థాయిలో జరిగింది. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో.. తెలంగాణలో కొత్తగా 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ కొలువుల జాతర ఇక్కడితో ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలకోసం జరిగిన ఉద్యమం.. ఇప్పుడు ఆ ఫలితాలను ప్రజలకు అందిస్తోంది.
ప్రస్తుతం గ్రూప్-1, పోలీస్, వైద్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ మొదలు కాగా.. తాజాగా మరో 10వేల పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకుల విద్యాలయాల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. నియామకాల ప్రక్రియ చేపట్ట వచ్చని తెలిపింది. మైనార్టీ గురుకుల విద్యాలయాలాల్లో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870 పోస్ట్ లు, గిరిజన గురుకులాల్లో 1,514 పోస్ట్ లు, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. TSPSC ద్వారా మరో 995 పోస్టులు భర్తీ చేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలకు కొత్త పోస్ట్ లు తోడవడంతో.. ఈ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా 45,325 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసేందుకు సన్నద్ధమైంది.
గ్రూప్-1కి అనూహ్య స్పందన..
గతంతో పోలిస్తే ఈసారి గ్రూప్-1 పోస్ట్ లకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 503 పోస్టులకు గాను.. 3,80,202 మంది పోటీపడుతున్నారు. రోజుకు సుమారు పది వేల మంది చొప్పున గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్నారు. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టినా.. గ్రూప్-1కి సంబంధించి ఇదే అతి పెద్ద నోటిఫికేషన్. దీంతో ఉద్యోగార్థులు.. ఉత్సాహంగా పరీక్షకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్-16న గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది ప్రభుత్వం. తాజాగా వరుసబెట్టి నోటిఫికేషన్లు విడుదలవుతుండటంతో.. నిరుద్యోగులకు ఒకటికంటే ఎక్కువ ఆప్షన్లు లభించాయి. మనసుపెట్టి ప్రిపేర్ అయితే.. ఏదో ఒక పోస్ట్ కొట్టడం సాధ్యం అనే నమ్మకంతో యువత కష్టపడుతోంది.