Telugu Global
National

శ్రీలంక సైన్యానికి పట్టిన ‘దైన్యం’ !

శ్రీలంకలో ఆహార సంక్షోభం నానాటికీ పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసర వస్తువులు, ఇంధన కొరత, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలు కొండెక్కి కూర్చుంటున్నాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నా సాధారణ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా.. రేపటి రోజెలా అన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. తినే తిండి కూడా లేకపోతే ఇక ఆకలి చావులే గతి అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి ! దీంతో లంక సైన్యమే చొరవ చూపి ‘గ్రీన్ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ’ అనే కమిటీనొకదాన్ని ఏర్పాటు చేసింది. […]

శ్రీలంక సైన్యానికి పట్టిన ‘దైన్యం’ !
X

శ్రీలంకలో ఆహార సంక్షోభం నానాటికీ పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసర వస్తువులు, ఇంధన కొరత, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలు కొండెక్కి కూర్చుంటున్నాయి. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నా సాధారణ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా.. రేపటి రోజెలా అన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. తినే తిండి కూడా లేకపోతే ఇక ఆకలి చావులే గతి అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి ! దీంతో లంక సైన్యమే చొరవ చూపి ‘గ్రీన్ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ’ అనే కమిటీనొకదాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ప్రాజెక్టును లాంచ్ చేసి.. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలన్నది ఈ కమిటీ లక్ష్యం..

ప్రభుత్వం ఇదివరకే ఈ విధమైన ప్రాజెక్టును చేపట్టినప్పటికీ దానికి సపోర్టుగా ఇది కూడా నిలబడనుంది. వచ్చే జులై నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఆశ్చర్యమేమిటంటే స్వయానా ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వికుమ్ లియనాగే ఈ కల్టివేషన్ డ్రైవ్ ని చేపట్టడం విశేషం.

ఈ ప్రాజెక్టు కింద బీడు భూములు లేదా వృధాగా పడిఉన్న ప్రభుత్వ భూముల్లో 1500 ఎకరాలను వ్యవసాయం కోసం ఎంపిక చేసి పంటలను పండిస్తారట. భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడకుండా ఇక సైనికులే ఆయుధాలు వదిలి నాగళ్లు పట్టి ఈ భూములను దున్నుతారట..

ఈ పనులన్నీ గ్రీన్ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీతో బాటు మేజర్ జనరల్ జగత్ కడితువక్కు సైతం దీన్ని సూపర్ వైజ్ చేస్తారని తెలుస్తోంది. మరి ఎమర్జెన్సీ ప్రాజెక్టుగా ఈ వ్యవసాయ పనులను పరిగణిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు కింద సైనికులు .. ఎంపిక చేసిన విత్తన వంగడాలకు అనువుగా భూమిని చదును చేయడం, దుక్కి దున్నడం చేస్తారని ‘న్యూస్ ఫస్ట్’ పత్రిక తెలిపింది. ఈ విషయంలో వీరికి వ్యవసాయ నిపుణులు సహకరిస్తారని వెల్లడించింది.

ఈ టాస్క్ కోసం ప్రాంతీయ స్థాయిల్లో ఆయా భూములను ఐడెంటిఫై చేస్తారని, గవర్నర్లు, జిల్లా, డివిజనల్ సెక్రటేరియట్లతోను, అధికారులు, గ్రామసేవా సిబ్బందితోను సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. ఇదంతా ప్లాన్డ్ ప్రకారం జరుగుతుందట..

ద్దేశంలో బియ్యం ధర చాలాహెచ్చుగా ఉన్న దృష్ట్యా ఇండియన్ క్రెడిట్ లైన్ కింద 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించామని ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు.

ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న లంకను ఆదుకునేందుకు ఇండియా వంద కోట్ల క్రెడిట్ లైన్ ని ఈ ప్రభుత్వానికి వర్తింపజేస్తోంది. ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొంతలో కొంతైనా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. లంక ప్రజలకు ఇండియా ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సాయం అవసరమైనా దాన్ని కొనసాగిస్తుందని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇదివరకే ప్రకటించారు.

First Published:  18 Jun 2022 8:42 AM IST
Next Story