Telugu Global
National

అగ్నిపథ్ నిరసనలతో కేంద్రం కొత్త ఎత్తు

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‘ పథకం పై దేశవ్యాప్తంగా నిరుద్యోగులనుండి వస్తున్న నిరసనలతో కేంద్రం రోజుకో కొత్త నిర్ణయాలను ప్రకటిస్తోంది. మొన్న అగ్ని వీర్ ల గరిష్ట వయోపరిమితి 21 ఏళ్ళ నుండి 23 ఏళ్ళకు పెంచిన ప్రభుత్వ అప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో అగ్నివీర్ లకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) శనివారం ఈ మేరకు ప్రకటన […]

agni new
X

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‘ పథకం పై దేశవ్యాప్తంగా నిరుద్యోగులనుండి వస్తున్న నిరసనలతో కేంద్రం రోజుకో కొత్త నిర్ణయాలను ప్రకటిస్తోంది. మొన్న అగ్ని వీర్ ల గరిష్ట వయోపరిమితి 21 ఏళ్ళ నుండి 23 ఏళ్ళకు పెంచిన ప్రభుత్వ అప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో అగ్నివీర్ లకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) శనివారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఆ ప్రకటన‌ ప్రకారం… అగ్నివీర్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లే కాకుండా అగ్నివీరులకు ఈ రెండు దళాల‌ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 3 ఏళ్ల పాటు, తొలి బ్యాచ్ వారికి గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

May be a Twitter screenshot of 1 person and text that says

దీని ప్రకారం సరిహద్దు భద్రతా దళం (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)ల్లో ఈ రిజర్వేషన్, వయో సడలింపు వర్తిస్తుంది. ఇవన్నీ కేంద్ర సాయుధ బలగాల కిందికే వస్తాయి.

May be a Twitter screenshot of 1 person and text that says
జూన్ 18, శనివారం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం కానున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. మరో వైపు ‘అగ్నిపథ్’ పథకం ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘

First Published:  17 Jun 2022 11:59 PM GMT
Next Story