అగ్నిపథ్ ఆందోళనకారుల లైఫ్ ఖతమేనా..?
ఆర్మీలో చేరి వీర సైనికుల్లా పోరాడాల్సిన ఆ యువకులు నేడు అనుకో్ని విధంగా చిక్కుల్లో పడ్డారు. దేశసేవ చేయాలనే తపనతో వారంతా శిక్షణ తీసుకుని ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయి రిక్రూట్ మెంట్ కు సిద్ధమైన వేళ కేంద్రం అగ్నిపథ్ పేరుతో పథకం తెచ్చి వారి ఆశలను బుగ్గి పాలు చేసింది. ఈ పథకంలో చేసే రిక్రూట్ మెంట్ ద్వారా కేవలం నాలుగేళ్ళ ఉద్యోగాన్నే కల్పిస్తుందని తెలిసి యువకులు నీరసించి పోయారు.ఈ పధకం కేంద్రం చెప్పినంత […]
ఆర్మీలో చేరి వీర సైనికుల్లా పోరాడాల్సిన ఆ యువకులు నేడు అనుకో్ని విధంగా చిక్కుల్లో పడ్డారు. దేశసేవ చేయాలనే తపనతో వారంతా శిక్షణ తీసుకుని ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయి రిక్రూట్ మెంట్ కు సిద్ధమైన వేళ కేంద్రం అగ్నిపథ్ పేరుతో పథకం తెచ్చి వారి ఆశలను బుగ్గి పాలు చేసింది. ఈ పథకంలో చేసే రిక్రూట్ మెంట్ ద్వారా కేవలం నాలుగేళ్ళ ఉద్యోగాన్నే కల్పిస్తుందని తెలిసి యువకులు నీరసించి పోయారు.ఈ పధకం కేంద్రం చెప్పినంత తియ్యగా లేదని నాలుగేళ్ళ తర్వాత తమ జీవితాలు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతాయని వాపోతున్నారు.
ఇంత కష్టపడి శిక్షణ పూర్తి చేసుకున్న తమ జీవితాలు అయోమయంలో పడేసరికి వారంతా ఆవేశానికి లోనయ్యారు. ఆ ఆవేశంలోనే ఆందోళనలకు దిగారు. అయితే అది చివరికి ఉద్ధృతమై విధ్వంసానికి దారితీసింది. ఈ ఘటనల్లో ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారు జీవితాంతం భారీ పనులు చేయలేరని వైద్యులు చెబుతున్నారు. వీరిలో కొందరు ఇక ఆర్మీ ఉద్యోగానికి అవసరమైన శిక్షణలో పాల్గొనలేరంటున్నారు. లాంగ్ జంప్, హైజంప్, పురుగు పెట్టడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని పరిస్థితులకు అనుగుణంగా వంపులు తిప్పడంలోఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.
భవిష్యత్తు కోల్పోవాల్సిందేనా…?
ఇదిలా ఉండగా, ఈ ఆందోళనల్లో పాల్గొన్న యువకులపై అటు రైల్వే పోలీసులు, సాధారణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైల్వే చట్టం కింద నమోదు చేసిన ఈ కేసుల వల్ల యువకులు తమ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విధ్వంసం సూత్రధారులపై జీఆర్పీ సెక్షన్లు నమోదు చేయడంతో వీరికి భవిష్యత్తులో లో ఆర్మీలో చేరే అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కానీ ఉండంటున్నారు.
అంతేగాక రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినందుకు ఐపిసి, ఐఆర్ ఎ( భారతీయ రైల్వే చట్టం)చట్టాలను ప్రయోగించారు. ఈ చట్టంలోని 14 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఐఆర్‌యే లోని 150సెక్షన్ కింద (హానికరంగా వ్యవహరించడం, రైళ్ళను దగ్ధం చేయడం) కేసు రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. వీరిపై నమోదు చేసిన కేసులన్నీ నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం.
కాగా, నిరుద్యోగులతో కేంద్రం ఆటలాడుకుంటోందని, తమ రాజకీయ లబ్ధి కోసం ఉపాధి పేరుతో తమ భవివష్యత్తును నట్టేట ముంచేందుకు ఈ పథకాన్ని తెచ్చిందని సైనిక శిక్షణ పొందిన యువకులు ఆరోపిస్తున్నారు. అస్సోం రైఫిల్స్,తదితర పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగాలు పొందవచ్చని చెప్పడం సరైంది కాదంటున్నారు. ఇంతమంది యువకులు నాలుగేళ్ళు ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు రావడం సులభమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పథకం పై పునరాలోచించి రిక్రూట్ మెంట్ నిర్వహించి యువకులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.