ఉద్ధృతమవుతున్న కరోనా..ఒక్కరోజులోనే 13వేలు దాటిన కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. పదుల సంఖ్యలో మొదలైన కేసులు వేల సంఖ్యకి చేరుకుంటున్నాయి. గత 24 గంటల్లో 13,216 కేసులు నమోదవడం వైరస్ ఉద్ధృతిని తెలియజేస్తోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు 13 వేలను దాటడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 4,84,924 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా వీరిలో 13,216 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 8,148 […]
దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. పదుల సంఖ్యలో మొదలైన కేసులు వేల సంఖ్యకి చేరుకుంటున్నాయి. గత 24 గంటల్లో 13,216 కేసులు నమోదవడం వైరస్ ఉద్ధృతిని తెలియజేస్తోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు 13 వేలను దాటడం ఆందోళన కలిగిస్తోంది.
గత 24 గంటల్లో 4,84,924 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా వీరిలో 13,216 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 8,148 మంది కరోనా నుంచి కోలుకోగా 23 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 5,24,840 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.63 శాతంగా, క్రియాశీల రేటు 0.16 శాతంగా ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
తాజాగా గత24 గంటల్లో వివిద రాష్ట్రాల్లో నమోదయిన కోవిడ్ కేసుల సంఖ్య వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర-4,165,కేరళ-3,162, ఢిల్లీ-1,797, ్‌లియాణా-689,కర్ణాటక-634, తమి|లనాడు-599, ఉత్తర ప్రదేశ్-461, పవ్చిమ బెంగాల్-295, తెలంగాణ-279, గుజరాత్ 225 కేసుల చొప్పున నమోదయ్యాయి.