Telugu Global
NEWS

అగ్నిపథ్ కాల్పుల్లో మరణించిన వరంగల్ రాకేష్ కుటుంబానికి కేసీఆర్ అండ..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ నిరసనకారులపై రైల్వే బలగాల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణించిన సంగతి తెలిసిందే. రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. రాకేష్ మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేష్ కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. 25లక్షలు పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం […]

cm kcr
X

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ నిరసనకారులపై రైల్వే బలగాల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణించిన సంగతి తెలిసిందే. రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. రాకేష్ మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేష్ కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

25లక్షలు పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం

రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆ కుటుంబంలో అర్హులైన వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే రాకేష్ బలయ్యాడంటూ విచారం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

నిరుద్యోగులు ప్రభుత్వాలకు శత్రువులు కాదు.. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక ప్రక్రియ చేపడతామంటూ కేంద్రం ప్రకటించేసరికి వారి కడుపు మండింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆందోళనకారుల్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ ని నిలిపివేసి మరీ ప్రజల్ని కష్టాలపాలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుంది. వారికి అండగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టింది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడింది. నష్టపరిహారంతోపాటు.. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించింది.

First Published:  17 Jun 2022 7:41 PM GMT
Next Story