Telugu Global
NEWS

‘అగ్నిపథ్ పథకం ఓ అద్భుత‌మైన దేశభక్తుడిని బలితీసుకుంది’

అతనికి నరనరాన దేశభక్తి… దేశ సైనికుడై సరిహద్దుల్లో పని చేయాలనే తహతహ…. ప్రతి క్షణ సైనిక జీవితం గురించే ఆలోచన….. సైన్యంలో చేరడానికి ప్రతి రోజూ శ్రమ….. ఇవీ పోలీసుకాల్పుల్లో మరణించిన రాకేష్ గురించి ఆయన స్నేహితులు, కుటుంబం చెప్తున్న మాటలు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెండాడు దామెర రాకేష్‌. మహబూబాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన […]

rakesh
X

అతనికి నరనరాన దేశభక్తి… దేశ సైనికుడై సరిహద్దుల్లో పని చేయాలనే తహతహ…. ప్రతి క్షణ సైనిక జీవితం గురించే ఆలోచన….. సైన్యంలో చేరడానికి ప్రతి రోజూ శ్రమ….. ఇవీ పోలీసుకాల్పుల్లో మరణించిన రాకేష్ గురించి ఆయన స్నేహితులు, కుటుంబం చెప్తున్న మాటలు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెండాడు దామెర రాకేష్‌.

మహబూబాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన రాకేశ్‌ హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. “అతను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుండి ప్రేరణ పొంది సాయుధ దళాలలో చేరాలని కోరుకున్నాడు” అని అతని తల్లి పూలమ్మ చెప్పారు.

దామెర కుమార స్వామి, పూలమ్మల కుమారుడు, 21 ఏళ్ల రాకేష్ రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు.మీసాల వల్ల ఉద్యోగం కోల్పోయాడు. “అతను భారత రక్షణ దళంలో ఉద్యోగం పొందాలని నిశ్చయించుకున్నాడు. అతను ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి ఉన్నాడు. అయితే అగ్నిపథ్‌ పథకం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురై హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి శుక్రవారం సాయంత్రం నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు’’ అని అతని స్నేహితుల్లో ఒకరు చెప్పారు.

బీసీ వర్గానికి చెందిన రాకేష్ గత కొన్నేళ్లుగా హన్మకొండలో ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నాడు. రాకేష్ తల్లిదండ్రులు రైతులు, అతని అన్నయ్య శారీరక వికలాంగుడు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక అద్భుత‌మైన దేశభక్తుడి ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు విమర్శించారు.

నిరుపేదలైన రాకేష్ తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే రాకేష్ మరణంపై ధిగ్బ్రాంతికి లోనైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

First Published:  17 Jun 2022 10:54 PM GMT
Next Story