‘వ్యవసాయ చట్టాల లాగానే ‘అగ్నిపథ్’ ను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది’
కేంద్రం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‘ పథకంపై నిరుద్యోగుల నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. 8 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం రైతులు, సైనికులను అవమానిస్తోందని ఈ రోజు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం తీసుక వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని తాను ముందే చెప్పానని తాను చెప్పినట్టే మోదీ ఉపసంహరించుకున్నారని రాహుల్ అన్నారు. అదే విధంగా ఆ మాఫీవీర్(క్షమాపణల వీరుడు) దేశ యువత నిరసనల వల్ల ‘అగ్నీపథ్’ పథకాన్ని కూడా […]
కేంద్రం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‘ పథకంపై నిరుద్యోగుల నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. 8 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం రైతులు, సైనికులను అవమానిస్తోందని ఈ రోజు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం తీసుక వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని తాను ముందే చెప్పానని తాను చెప్పినట్టే మోదీ ఉపసంహరించుకున్నారని రాహుల్ అన్నారు.
అదే విధంగా ఆ మాఫీవీర్(క్షమాపణల వీరుడు) దేశ యువత నిరసనల వల్ల ‘అగ్నీపథ్’ పథకాన్ని కూడా వెనక్కి తీసుకోవలసి వస్తుంది. అని ట్విట్టర్ లో కామెంట్ చేశారు.
కాగా కేంద్రం మాత్రం తాము ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఎలాగైనా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఆ పథకంలో రోజుకో మార్పు చేస్తున్నది. వయసు సడలింపు, రిజర్వేషన్లు, బ్కాంకు లోన్లు, పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యత అంటూ యువతకు ఆశలు కల్పిస్తోంది. అయితే కేంద్రం వేస్తున్న ఎత్తుగడలకు నిరుద్యోగ యువత ముఖ్యంగా ఆర్మీ అభ్యర్థులు లొంగడంలేదు. తమ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆర్మీలో చేరడం కోసం రెండేళ్ళ క్రితమే ఫిజికల్, మెడికల్ టెస్ట్ లు పాసైన యువత, రాత పరీక్షకోసం రెండేళ్ళుగా ఎదిరి చూస్తూ అసహనంతో రగిలిపోతున్న అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ మాట వింటారా ? లేక రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రభుత్వ ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుందా వేచి చూడాలి.