Telugu Global
NEWS

హైద‌రాబాద్ లో యువ‌తిపై వ‌ర్సిటీ విద్యార్థుల‌ అత్యాచారం

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో బాలిక‌పై సామూహిక అత్యాచార ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే నగరంలో ఒక యువతిపై అత్యాచారం జ‌ర‌గ‌డం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీకి ర‌మ్మ‌ని ఆ యువ‌తిపై స్నేహితుడే దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఆల‌స్యంగా వెలుగు చూసిన‌ ఈ ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ కు చెందిన 28 ఏళ్ల యువతి కంటెంట్ రైటర్ గా పనిచేస్తూ ప్రగతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్వెల్ […]

Rape-HYD-Central-university-students
X

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో బాలిక‌పై సామూహిక అత్యాచార ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే నగరంలో ఒక యువతిపై అత్యాచారం జ‌ర‌గ‌డం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీకి ర‌మ్మ‌ని ఆ యువ‌తిపై స్నేహితుడే దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఆల‌స్యంగా వెలుగు చూసిన‌ ఈ ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ కు చెందిన 28 ఏళ్ల యువతి కంటెంట్ రైటర్ గా పనిచేస్తూ ప్రగతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్వెల్ అనే అతడు జూన్ 13న తన పుట్టినరోజు ఉందంటూ ఆ యువ‌తిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్ లోని ఓ పబ్ కు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్ లో పార్టీ అనంతరం ఈ నెల 13 రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్ మనుప్రీత్ కిషోర్ ప్రగతి నగర్ లో యువతి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ కాల‌క్షేపం చేశారు. అనంత‌రం ఆమె నిద్ర పోయింది.

స్నేహితులు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో మరో ఇద్దరు ఇంకో గదిలో ప‌డుకున్నారు. సుమారు 6.15 గంటల సమయంలో రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతడిని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు యువతి జూన్ 15వ తేదీన త‌మ‌కు ఫిర్యాదు చేసింద‌ని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులని పోలీసులు చెబుతున్నారు. ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? ఎవ‌రెవ‌రు దీనికి సహకరించారు త‌దితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

First Published:  17 Jun 2022 7:00 AM IST
Next Story