పెట్రోల్‌పై చివరకు మిగిలిన ఒక్క రాయితీ కూడా ఎత్తేశారు.. ఇక పూర్తి చెల్లింపులే
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. వినియోగదారులకు ఏ మాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. కారణం గత ఏడాదిలోనే భారీగా ధరలు పెంచిన కేంద్రం.. కంటితుడుపుగా కాస్త తగ్గించడమే కారణం. దీంతో ఇప్పటికే వాహనదారులు బయటకు బండ్లు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కొనుగోళ్లపై ఉన్న చిట్టచివరి రాయితీని తాజాగా ఎత్తేశారు. పెట్రోల్ కొనుగోళ్లపై డిజిటల్ చెల్లింపులు చేస్తే 0.75 శాతం రాయితీ వచ్చేది. ఆయా […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. వినియోగదారులకు ఏ మాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. కారణం గత ఏడాదిలోనే భారీగా ధరలు పెంచిన కేంద్రం.. కంటితుడుపుగా కాస్త తగ్గించడమే కారణం. దీంతో ఇప్పటికే వాహనదారులు బయటకు బండ్లు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కొనుగోళ్లపై ఉన్న చిట్టచివరి రాయితీని తాజాగా ఎత్తేశారు.
పెట్రోల్ కొనుగోళ్లపై డిజిటల్ చెల్లింపులు చేస్తే 0.75 శాతం రాయితీ వచ్చేది. ఆయా పెట్రోలియం కంపెనీలు మన ఖాతాలోకి తిరిగి జమ చేసేవి. అయితే గత నెల నుంచి పెట్రోలియం కంపెనీలు రాయితీని నిలిపివేశాయి. దీంతో పలు బ్యాంకులు కూడా రాయితీని ఇవ్వడం మానేశాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల కోసం 0.75 శాతం ఇస్తున్న ప్రోత్సాహక రాయితీని విరమించుకున్నాయి. దీంతో తమ బ్యాంకు కూడా ఇకపై కార్డులు, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై రాయితీని ఇవ్వబోదు అని పీఎన్‌బీ స్పష్టం చేసింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు భారీగానే రాయితీ వచ్చేది. కానీ ఇప్పడు ఆ రాయితీ కూడా పోవడంతో పూర్తి ధరకే పెట్రోల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
డీమానిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లిపులను ప్రోత్సహించాలనే కారణంతో 2016 డిసెంబర్ 13 నుంచి ఈ రాయితీని అందిస్తున్నారు. క్రెడిట్, డెబిట్, యూపీఐ చెల్లింపులకు ఈ రాయితీ వర్తించేది. గతంలోనే క్రెడిట్ కార్డులకు ఈ రాయితీ తొలగించారు. ఇక మే చివరి వారం నుంచి డెబిట్, యూపీఐ పేమెంట్లకు కూడా రాయితీ నిలిపివేశారు.