దేశంలో కరోనా విజృంభణ..ఒక్క రోజులో 12 వేలకు పైగా కేసులు
దేశంలో రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. వరసగా రెండో రోజు కూడా 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా సమాచారం మేరకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అర్ధమవుతోంది. గురువారంనాడు 5లక్షల 19వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 12,847 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 4.32 కోట్లకు […]
దేశంలో రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. వరసగా రెండో రోజు కూడా 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా సమాచారం మేరకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అర్ధమవుతోంది. గురువారంనాడు 5లక్షల 19వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 12,847 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 4.32 కోట్లకు చేరింది.
ఢిల్లీలో కేవలం పది రోజుల్లోనే 7వేలకు పైగా కేసులు నమోదవడం వైరస్ వ్యాప్తికి నిదర్శనం. జూన్ 7న 1.92శాతం గా ఉన్న కేసుల సంఖ్య ఈ నెల 15 నాటికి 7.01 శాతానికి పెరగడంతో పరిస్థితి తీవ్రంగా మారుతున్నట్టు కనబడుతోంది. ప్రస్తతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,063కు చేరింది. దీంతో మొత్తం కేసుల్లో బాధితుల సంఖ్య 0.15 శాతానికి పెరిగింది. గురువారంనాడు 7,985 మంది మాత్రమే కోలుకోవడంతో రికవరీ రేటు 98.64 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది.
కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర 4,255 కేసులతో ముందు వరసలో ఉంది. కేరళలో 3,419, ఢిల్లీలో 1,327, కర్ణాటకలో 833, హరియాణా 625, తమిళనాడు 552, ఉత్తర ప్రదేశ్ లో 413 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలతో పాటు గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలలో కూడా వందకు పైబడి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.