Telugu Global
National

ఎలుకల నుంచి బంగారం స్వాధీనం ! ఇదెలా సాధ్యం ..?

లక్షల విలువ చేసే బంగారాన్ని ఎలుకల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే ఆశ్చర్య పోవలసిందే ! కానీ ఇది నిజం ! ముంబైలో సుందరి అనే మహిళ చెప్పిన ఈ సంగతి వింటే ముక్కున వేలేసుకోవలసిందే. తన కూతురి పెళ్ళికి తీసుకున్న రుణం చెల్లించడానికి 10 తులాల బంగారు నగలను ఓ సంచీలో పెట్టుకుని ఈమె బ్యాంకుకు బయల్దేరిందట.. మధ్యలో రోడ్డు పక్కన వడపావ్ అమ్ముతుంటే కొనుక్కుని అదే బ్యాగులో ఉంచి నడక సాగించింది. అయితే ఓ […]

Gold-Rats-mumbai
X

లక్షల విలువ చేసే బంగారాన్ని ఎలుకల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే ఆశ్చర్య పోవలసిందే ! కానీ ఇది నిజం ! ముంబైలో సుందరి అనే మహిళ చెప్పిన ఈ సంగతి వింటే ముక్కున వేలేసుకోవలసిందే. తన కూతురి పెళ్ళికి తీసుకున్న రుణం చెల్లించడానికి 10 తులాల బంగారు నగలను ఓ సంచీలో పెట్టుకుని ఈమె బ్యాంకుకు బయల్దేరిందట.. మధ్యలో రోడ్డు పక్కన వడపావ్ అమ్ముతుంటే కొనుక్కుని అదే బ్యాగులో ఉంచి నడక సాగించింది. అయితే ఓ చోట ఇద్దరు పేద పిల్లలు అడుక్కుంటూ రాగా అందులో కేవలం వడ పావ్ ఉందనుకుని ఆ బ్యాగ్ ఇచ్చేసిందట.. తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకునేసరికి ఆ నగల బ్యాగ్ కనిపించలేదు. వెంటనే ఆదరాబాదరాగా తనకు పిల్లలు కనబడిన ప్రాంతానికి వెళ్లి వాళ్ళ కోసం చూసేసరికి వాళ్ళు కనిపించలేదు. లబోదిబోమంటూ పోలీసు స్టేషనుకు వెళ్లి ఈ వైనమంతా చెప్పింది సుందరి.

10 తులాల బంగారమంటే 5 లక్షల విలువైనవని తెలిసి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు, మొత్తానికి ఆ పేద పిల్లలు, వారి తల్లి ఆచూకీని కనుక్కున్నారు. అయితే వడ పావ్ పాడైపోవడంతో ఆ బ్యాగ్ ని ఓ చెత్తకుప్పలో పారేశామని ఆ తల్లి చెప్పింది. ఖాకీలు పట్టువదలకుండా ఆ ప్రాంతం లో సీసీటీవీ ఫుటేజీని చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ బ్యాగ్ ని ఎలుకలు కొన్ని నోట కరుచుకుని మురుగు కాలువలోకి వెళ్తుండడం చూశారు. మొత్తానికి వాటిని పట్టుకుని ఆ నగల బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు. ‘విజయ గర్వం’తో ఆ నగల సంచీని సుందరికి అప్పగించగానే ఆమె సంతోషానికి అవధులు లేకపోయింది. ఎలుకలంటే బంగారమే మరి అని ఆమె పాడుకుంటోందట ‘ !

ముంబైలో ఈ సుందరికి కలిగిన ఈ అనుభవం విని అంతా ఆశ్చర్యపోతూనే ఆమెను అభినందించడం కొసమెరుపు !”

First Published:  17 Jun 2022 1:00 AM IST
Next Story