అస్సోం, మేఘాలయల్లో వరద బీభత్సం..16 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, మేఘాలయ ల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రదాన నదులైన బ్రహ్మపుత్ర,గౌరంగ నదులు ప్రమాద స్తాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి.లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు రాష్ట్రాలలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా 16 మంది మరణించారు. కొత్తగా ఏర్పాటైన బజలి జిల్లాతో పాటు మొత్తం 25 జిల్లాలలో వరదల కారణంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు […]
ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, మేఘాలయ ల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రదాన నదులైన బ్రహ్మపుత్ర,గౌరంగ నదులు ప్రమాద స్తాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి.లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు రాష్ట్రాలలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా 16 మంది మరణించారు.
కొత్తగా ఏర్పాటైన బజలి జిల్లాతో పాటు మొత్తం 25 జిల్లాలలో వరదల కారణంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు నివాసాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లోని 19782.80 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. 72 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో 1,510 గ్రామాలు జసల దిగ్బంధనంలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర పనుల్లో మినహా ప్రజలు తగినంత పనిలేనిదే బయటికి వెళ్లవద్దని అదికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వరసగా మూడో రోజు కూడా రాజధాని గౌహతి నగరం జలదిగ్బంధనంలోనే ఉండడంతో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. గౌహతి నగరంలో పలు చోట్ల కొండచరియలు విడిగిపడడంతో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు అందాయి. బక్సా జిల్లాలో, సుబంఖాటా ప్రాంతంలో బుధవారంనాడు ఓ వంతెన సగభాగం కూలిపోయింది. ఎడతెగని వర్షపాతం తో దిహింగ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షపాతం, వరదల కారణంగా ఆరు రై|ళ్ళు రద్దవగా నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
కాగా అస్సోం వరద బాధితలను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ , దర్శకుడు రోహిత్ శెట్టి 5 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. వారి దాతృత్వానికి ముఖ్యమంత్రి హిమంత బిస్వా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మేఘాలయలో కూడా..
అస్సాంతో పాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు ముంచెత్తుతూ సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మేఘాలయలో 13 మంది, అస్సాంలో ముగ్గురు మరణించారని వార్తలందాయి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మేఘాలయ ప్రబుత్వం అధికారులతో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటీకి కేబినెట్ మంత్రి నేతృత్వం వహిస్తారు. భారీ వరదలు వర్షాలకు ఆరో నంబర్ జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
కాగా, అస్సోం,మేఘాలయల్లో బుధవారం వరకూ సాధారణ వర్షపాతం కంటే అధికంగా 272 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల వరకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు పొడిగించారు.