50 ఓవర్లలో 498 పరుగులు.. వన్డేల్లో ఇంగ్లండ్ జంట ప్రపంచ రికార్డులు
50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి పరుగుల సునామీ సృష్టించింది. తన పేరుతో ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచరికార్డును ఇంగ్లండ్ తిరగరాసుకొంది. యామస్టల్వీన్ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన 2022 సిరీస్ తొలివన్డేలో 500 పరుగుల స్కోరుకు రెండుపరుగుల దూరంలో నిలిచింది. ఇంగ్లండ్ కు ఇంగ్లండ్ సాటి.. యాభై ఓవర్లు , 300 బాల్స్ లో పలుమార్లు అత్యధిక స్కోర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కు ఇంగ్లండ్ మాత్రమే సాటి. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు అత్యధిక […]
50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి పరుగుల సునామీ సృష్టించింది. తన పేరుతో ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచరికార్డును ఇంగ్లండ్ తిరగరాసుకొంది. యామస్టల్వీన్ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన 2022 సిరీస్ తొలివన్డేలో 500 పరుగుల స్కోరుకు రెండుపరుగుల దూరంలో నిలిచింది.
ఇంగ్లండ్ కు ఇంగ్లండ్ సాటి..
యాభై ఓవర్లు , 300 బాల్స్ లో పలుమార్లు అత్యధిక స్కోర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కు ఇంగ్లండ్ మాత్రమే సాటి. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు అత్యధిక స్కోర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒకేఒక్కజట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఓపెనర్ జోస్ బట్లర్ 162 పరుగుల నాటౌట్ స్కోరు సాధించగా…ఫిలిప్ సాల్ట్ 122, డేవిడ్ మలన్ 125 పరుగుల స్కోర్లు సాధించడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 498 పరుగుల స్కోరుతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగింది. గతంలో ఆస్ట్ర్రేలియాతో 2018 వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన పోరులో ఇంగ్లండ్ సాధించిన 6 వికెట్లకు 481 పరుగులే అత్యధిక టీమ్ స్కోరుగా నిలిచింది. నాటింగ్ హామ్ వేదికగా 2018లో నెలకొల్పిన తన ప్రపంచ రికార్డును ఇంగ్లండ్..నాలుగేళ్ల విరామం తర్వాత డచ్ నేల ఆమ్ స్టల్ వీన్ లో అధిగమించడం విశేషం.
2016లో నాటింగ్ హామ్ వేదికగానే జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై 3 వికెట్లకు 444 పరుగుల స్కోరు సాధించిన ఇంగ్లండ్ ..ఆ తర్వాత 481, 498 పరుగుల స్కోర్లతో
చరిత్ర సృష్టించింది.
సిక్సర్ల వెల్లువ..
నెదర్లాండ్స్ పైన అత్యధిక స్కోరుతో ప్రపంచ రికార్డు మాత్రమే కాదు..సిక్సర్లబాదుడులోనూ ఇంగ్లండ్ మరో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఏకంగా 26 సిక్సర్లు బాదారు. 2019లో మాంచెస్టర్ వేదికగా అప్ఘనిస్థాన్ తో వన్డే మ్యాచ్ లో 25 సిక్సర్లు సాధించిన ఇంగ్లండ్…ఇప్పుడు ఆ ప్రపంచ రికార్డును సైతం అదనంగా మరో సిక్సర్ తో అధిగమించింది.