Telugu Global
National

మధ్యప్రదేశ్, హర్యానా, యూపీల్లోనూ ‘అగ్నిపథ్’ సెగలు

కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం తాలూకు సెగలు వరుసగా మూడో రోజుకూడా కొనసాగుతున్నాయి. బీహార్ తో బాటు మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం హింసాత్నక ఘటనలు జరిగాయి. బీహార్ లోని వెస్ట్ చాంపరన్ జిల్లాలో డిప్యూటీ సీఎం రేణుదేవి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. ప్రస్తుతం పాట్నాలో ఉన్న ఆమె.. ఇలాంటి హింసాకాండ సమాజానికి ఎంతో చేటు తెస్తుందని, ఇది సమాజానికి నష్టం కలుగజేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించాలని అన్నారు. బీహార్ లో ఈ ఉదయం […]

agneepath-scheme-violence-continue-across-the-country
X

కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం తాలూకు సెగలు వరుసగా మూడో రోజుకూడా కొనసాగుతున్నాయి. బీహార్ తో బాటు మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం హింసాత్నక ఘటనలు జరిగాయి. బీహార్ లోని వెస్ట్ చాంపరన్ జిల్లాలో డిప్యూటీ సీఎం రేణుదేవి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. ప్రస్తుతం పాట్నాలో ఉన్న ఆమె.. ఇలాంటి హింసాకాండ సమాజానికి ఎంతో చేటు తెస్తుందని, ఇది సమాజానికి నష్టం కలుగజేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించాలని అన్నారు.

బీహార్ లో ఈ ఉదయం కూడా వందలాది యువకులు, సైన్యంలో చేరగోరుతున్న విద్యార్థులు రైల్వే పట్టాలపై బైఠాయించారు. అనేక చోట్ల రోడ్లను దిగ్బంధించారు. బెగుసరాయ్ జిల్లాలో రైల్వే స్టేషన్ లోకి దూసుకువచ్చిన ఆందోళనకారులు రాళ్లు విసిరి అక్కడ బీభత్సం సృష్టించారు. సమస్తిపూర్ జిల్లాలో జమ్మూ-తావి ఎక్స్ ప్రెస్ కి చెందిన రెండు బోగీలకు , కుహాదియా స్టేషన్ లోని రైలుకు నిప్పు పెట్టారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కూడా మంటల్లో చిక్కుకుంది. ఆందోళనకారులు లఖిసరాయ్ జిల్లాలో బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో రైల్వే స్టేషన్లోకి చొరబడిన నిరసనకారులు ఓ రైలు బోగీకి నిప్పంటించారు. కర్రలు, లాఠీలతో వచ్చిన వీరు దుకాణాలను నాశనం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. బీహార్ లో నేడు 38 రైళ్లను అధికారులు రద్దు చేశారు. వారణాసిలో నిరసనకారులు బస్సులు, ఇతర వాహనాలపై రాళ్లు రువ్వారు. , ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాలకు కూడా నిరసన సెగలు పాకాయి. ఈ రాష్ట్రాల్లో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాల్వాల్ జిల్లాలో పలు చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలో రైళ్ల రాకాపోకలకు ఆటంకం కలిగించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు నానా పాట్లు పడ్డారు.

హర్యానాలో పోలీసుల వాహనాలకు కొందరు నిప్పు పెట్టారు. వారి రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్ప వాయువు ప్రయోగించారు. ఇంత జరుగుతున్నా అగ్నిపథ్ పథకం యువతకు మేలు చేకూరుస్తుందని, వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మరో మంత్రి గడ్కరీ తదితర బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు.

First Published:  17 Jun 2022 7:05 AM IST
Next Story