విరాటపర్వం ప్రీ-రిలీజ్ బిజినెస్
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన విరాటపర్వం రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలా అని భారీ రేట్లకు సినిమాను అమ్మలేదు. ఉన్నంతలో రీజనబుల్ రేట్లకే సినిమాను అమ్మారు. ఓవైపు కరోనాతో షూటింగ్ రోజులు పెరిగి, బడ్జెట్ పెరిగినప్పటికీ రేట్లు మాత్రం పెంచలేదు. రానా, సాయిపల్లవి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 కోట్ల రూపాయల […]
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన విరాటపర్వం రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలా అని భారీ రేట్లకు సినిమాను అమ్మలేదు. ఉన్నంతలో రీజనబుల్ రేట్లకే సినిమాను అమ్మారు. ఓవైపు కరోనాతో షూటింగ్ రోజులు పెరిగి, బడ్జెట్ పెరిగినప్పటికీ రేట్లు మాత్రం పెంచలేదు. రానా, సాయిపల్లవి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక నైజాంలో 4 కోట్లు, సీడెడ్ లో 2 కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మినట్టు సమాచారం. అలా ఏపీ-తెలంగాణలో ఈ సినిమాను 11 కోట్ల రూపాయలకు అమ్మినట్టు టాక్. అయితే ఇందులో మళ్లీ లెక్కలు మారతాయి. కొన్ని అడ్వాన్సులున్నాయి. మరికొన్ని డైరక్ట్ రిలీజ్ ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో సురేష్ బాబు నేరుగా రిలీజ్ చేస్తున్నారు.
మొత్తమ్మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11న్నర కోట్ల రూపాయలు వస్తే సరిపోతుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే అదేమంత పెద్ద సమస్య కాదు. గట్టిగా ఆడితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కూడా. ఎఁదుకంటే, మరో సినిమా పోటీలో లేదు.
ఇక ఈ సినిమాకు ఇప్పటికే సాధారణ టికెట్ రేట్లు తగ్గించారు. తెలంగాణలో మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు రేట్లు పెట్టారు. ఏపీలో మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 147 రూపాయల ధరల్ని నిర్ణయించారు. ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.