Telugu Global
National

24 ఏళ్లుగా పరారీలో ఉన్న హంత‌కుడు ఎట్ట‌కేల‌కు దొరికాడు

శంకర్ బిస్వాల్‌. రెండు హ‌త్య‌కేసుల్లో, 10 హ‌త్యాయ‌త్నం కేసులతోపాటు, ఒక దొంగ‌త‌నం కేసులో నిందితుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌. రెండు దశాబ్దాలుగా పరారీలో జీవితం గ‌డుపుతూ పోలీసుల‌కు చుక్క‌లు చూపించాడు. 24 ఏళ్లు అయిందిక‌దా…ఇక పోలీసులు మ‌ర్చిపోయి ఉంటార‌నుకుని కుటుంబ స‌భ్యుల‌ను ర‌హ‌స్యంగా క‌లుసుకోవ‌డానికి ఏకంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. అలా ఆ 42 ఏళ్ల శంకర్ బిస్వాల్‌ ఎట్టకేలకు ఒడిశాలోని గంజాం జిల్లాలోని తన సొంత గ్రామంలో గురువారం పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. పక్కా సమాచారం మేరకు, […]

criminal
X

శంకర్ బిస్వాల్‌. రెండు హ‌త్య‌కేసుల్లో, 10 హ‌త్యాయ‌త్నం కేసులతోపాటు, ఒక దొంగ‌త‌నం కేసులో నిందితుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌. రెండు దశాబ్దాలుగా పరారీలో జీవితం గ‌డుపుతూ పోలీసుల‌కు చుక్క‌లు చూపించాడు. 24 ఏళ్లు అయిందిక‌దా…ఇక పోలీసులు మ‌ర్చిపోయి ఉంటార‌నుకుని కుటుంబ స‌భ్యుల‌ను ర‌హ‌స్యంగా క‌లుసుకోవ‌డానికి ఏకంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. అలా ఆ 42 ఏళ్ల శంకర్ బిస్వాల్‌ ఎట్టకేలకు ఒడిశాలోని గంజాం జిల్లాలోని తన సొంత గ్రామంలో గురువారం పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

పక్కా సమాచారం మేరకు, పోలీసులు శంకర్ బిస్వాల్‌ని ఖల్లికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసిపూర్ గ్రామం నుండి అదుపులోకి తీసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌గా ఒడిశా పోలీసు రికార్డుల్లో ఉన్న శంకర్ బిస్వాల్ కేరళలో రోజువారీ కూలీగా పనిచేస్తు ఎవ‌రి కంటా క‌న‌బ‌డ‌కుండా 24 ఏళ్లుగా మ్యానేజ్ చేస్తున్నాడు. కానీ కుటుంబ స‌భ్యుల‌ను, సొంత గ్రామాన్ని చూడాల‌న్న కోరిక చంపుకోలేక సొంత గ్రామానికి వ‌చ్చి దొరికిపోయిన‌ట్లు పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ రాయ్ తెలిపారు.

శంకర్ బిస్వాల్‌పై 1998లో రెండు హత్యలు, 10 హత్యాప్రయత్నాలు, ఒక దొంగతనం కేసుతో సహా 13 కేసులు న‌మోదైన‌ట్లు రాయ్ చెప్పారు. గతంలో అతడిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ప్రతిసారీ పోలీసులకు నిరాశే మిగ‌లిందని… అతడిని అరెస్టు చేసేందుకు ఒక బృందాన్ని కేరళకు కూడా పంపామని, అయితే వారి లక్ష్యం నెరవేరలేదని ఎస్పీ తెలిపారు.

పరారీలో ఉన్న 24 ఏళ్ల జీవితంలో, బిస్వాల్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కేరళలో రోజువారీ కూలీగా పనిచేశాడని ఖల్లికోట్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ జగన్నాథ్ మల్లిక్ తెలిపారు.
బిస్వాల్‌కు భార్య‌తోపాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

First Published:  16 Jun 2022 11:49 AM IST
Next Story