Telugu Global
National

ఐటీ ఉద్యోగం వ‌దిలేసి.. గాడిద‌ల ఫామ్ పెట్టాడు

నెలకు లక్షకు పైగా జీతం వచ్చే సలక్షణమైన ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్నాడు ఆ టెకీ.. మరి ఇంతకన్నా ఎక్కువ వేతనం వచ్చే మరో జాబ్ కోసం ట్రై చేశాడా అంటే.. అసలా థాట్ రానేలేదంటున్నాడు. మరి ఇంతకీ ఏం చేశాడంటే.. ఎవరూ ఊహించనట్టు గాడిద పాల క్షేత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడో కాదు ! కర్ణాటకలోని మంగుళూరులో ! శ్రీనివాస గౌడ అనే ఈ యువకుడి గాడిద పాల క్షేత్రంలో ఇప్పుడు 20కి పైగా గాడిదలున్నాయి. […]

Srinivas-gowda-quit-it-job-open-donkey-milk-farm
X

నెలకు లక్షకు పైగా జీతం వచ్చే సలక్షణమైన ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్నాడు ఆ టెకీ.. మరి ఇంతకన్నా ఎక్కువ వేతనం వచ్చే మరో జాబ్ కోసం ట్రై చేశాడా అంటే.. అసలా థాట్ రానేలేదంటున్నాడు. మరి ఇంతకీ ఏం చేశాడంటే.. ఎవరూ ఊహించనట్టు గాడిద పాల క్షేత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడో కాదు ! కర్ణాటకలోని మంగుళూరులో ! శ్రీనివాస గౌడ అనే ఈ యువకుడి గాడిద పాల క్షేత్రంలో ఇప్పుడు 20కి పైగా గాడిదలున్నాయి. ఇందుకు 42 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడట.. 2020 వరకు తాను ఓ ఐటీ సంస్థలో పని చేశానని, కానీ ఆ జాబ్ లో సంతృప్తి చెందలేదని చెప్పిన గౌడ.. జీవనోపాధికోసం ఏదైనా వెరైటీ ప్రొఫెషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాడట.. అయితే ఏ ప్రొఫెషన్ లోకి అడుగుపెట్టాలో, లేదా ఏ బిజినెస్ చేయాలో అర్థం కాక.. సుమారు రెండేళ్లు అలా గడిపేశాడట. చివరకు తన ఫామ్ హౌస్ లో గాడిద పాల క్షేత్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

ఇండియాలో ఈ తరహా క్షేత్రం ఇదే మొదటిదని, ఇక్కడ ఉత్సాహవంతులైన యువకులకు శిక్షణ కూడా లభిస్తుందని శ్రీనివాస గౌడ చెబుతున్నాడు. శ్రేష్టమైన గాడిద పాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్న కారణంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని తెలిపాడు. గాడిదల జాతి క్రమేణా క్షీణీస్తోంది. వీటి సంరక్షణ కోసం ఎవరూ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు అని చెప్పిన గౌడ. మొదట్లో తన ఐడియా పట్ల అంతా దాదాపు హేళనగా మాట్లాడారని అన్నాడు. కానీ తన నిర్ణయం మారలేదన్నాడు. ప్రస్తుతం పాకెట్లలో గాడిద‌ పాలు అమ్ముతున్నాన‌ని, 30 మిల్లీ లీటర్ల పాకెట్ 150 రూపాయలని, మెల్లగా తన కొత్త తరహా బిజినెస్ పుంజుకొంటోందని గౌడ చెప్పాడు. మంగళూరులో అన్ని మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్లలో తమ గాడిద పాల పాకెట్లు లభ్యమవుతున్నాయన్నాడు. అప్పుడే తనకు 17 లక్షల విలువైన ఆర్డర్స్ వచ్చాయని సంతోషంగా చెప్పాడు.

ఆవులు, మేకలు, గేదెలు, ఒంటెలు వంటి జంతువుల పాల కన్నా గాడిద పాలు మంచివని అంటారు. హ్యూమన్ మిల్క్ కన్నా ఇందులో రైబో ఫ్లోవిన్, పిరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ వంటివి ఉన్నందువల్ల దగ్గు, చర్మ సంబంధ రుగ్మతలను నివారించవచ్చని నిపుణులు వెల్లడించారు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ ని చాలావరకు తగ్గిస్తుందని తేల్చారు. పైగా ఆస్తమా, జలుబు, జాండిస్, కీళ్ల జబ్బుల చికిత్సకు కూడా వీటి పాలను వినియోగిస్తారట. గాడిద పాల బాటిల్ లీటర్ ధర 4,500 రూపాయలని లెక్కలు చెబుతున్నాయి.

First Published:  16 Jun 2022 7:14 AM IST
Next Story