చిరుజల్లుల సీజన్‌లో చూడాల్సిన ప్రాంతాలివే..
జూన్ నెల రాగానే ఎండలు తగ్గుముఖం పట్టి చిరుజల్లులు మొదలవుతాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్న ఈ సీజన్‌లో ట్రావెల్ చేయడానికి బెస్ట్ స్పాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ నెలలో వాతావరణం చల్లగా మబ్బులు పట్టి ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో అందంగా ముస్తాబవుతాయి. అవేంటంటే.. మేఘాలయ మాన్‌సూన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మేఘాలయ. ఎప్పుడూ మేఘావృతమై ఉండే ఇక్కడి వాతావరణం జూన్ నెలలో మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మేఘాలయను ఎక్స్‌ప్లోర్ చేయడానికి జూన్ నెల […]
జూన్ నెల రాగానే ఎండలు తగ్గుముఖం పట్టి చిరుజల్లులు మొదలవుతాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్న ఈ సీజన్‌లో ట్రావెల్ చేయడానికి బెస్ట్ స్పాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ నెలలో వాతావరణం చల్లగా మబ్బులు పట్టి ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో అందంగా ముస్తాబవుతాయి. అవేంటంటే..
మేఘాలయ
మాన్‌సూన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మేఘాలయ. ఎప్పుడూ మేఘావృతమై ఉండే ఇక్కడి వాతావరణం జూన్ నెలలో మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మేఘాలయను ఎక్స్‌ప్లోర్ చేయడానికి జూన్ నెల సరైన సమయం.
గోవా
సమ్మర్‌లో వేడిగా ఉండే గోవా ప్రాంతమంతా జూన్ నెలలో చల్లబడుతుంది. మేఘావృతమైన ఆకాశంతో పాటు సముద్రంపై వీచే చల్లని గాలులను ఎంజాయ్ చేయాలంటే జూన్‌లో గోవా వెళ్లాల్సిందే.
మున్నార్
మాన్‌సూన్ మొదలయ్యే ముందు మున్నార్ వాతావరణమంతా మబ్బు పట్టి, చల్లని గాలులతో ఆహ్లాదకరంగా మారుతుంది. రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే కేరళను మాన్‌సూన్ సీజన్‌లో చుట్టిరావాల్సిన బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పొచ్చు.
అలిపి
చిరుజల్లులు కురుస్తుంటే పడవలో ప్రయాణించడమనేది నిజంగా ఓ అందమైన అనుభూతి. అందుకే ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ కోసం జూన్ నెలలో కేరళలోని అలపూజాకు వెళ్లాల్సిందే.
డార్జిలింగ్
మాన్‌సూన్ సీజన్‌లో వెళ్లేందుకు వెస్ట్ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్ఫెక్ట్ డెస్టినేషన్. చిరుజల్లులు మొదలయ్యే సమయంలో ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. డార్జిలింగ్ అందాలకు చిరుజల్లులు తోడైతే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.