Telugu Global
Health & Life Style

అనుకున్నంతా అయింది.. కరోనా కేసులు భారీగా పెరిగాయి..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 8వేల చుట్టూ తిరుగుతున్న కేసులు.. అమాంతం 12వేలకు చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. అపోహలకు బలం చేకురేలా ఉంది. 8 తర్వాత 9, 10, 11 క్రాస్ చేసుకుని ఒకేసారి కరోనా కేసులు 12వేలకు చేరడంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 12,213 నమోదయ్యాయి. ముందు రోజుకంటే కేసుల సంఖ్య 38.4 శాతం అధికంగా […]

corona-cases-increasing-india
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 8వేల చుట్టూ తిరుగుతున్న కేసులు.. అమాంతం 12వేలకు చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. అపోహలకు బలం చేకురేలా ఉంది. 8 తర్వాత 9, 10, 11 క్రాస్ చేసుకుని ఒకేసారి కరోనా కేసులు 12వేలకు చేరడంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 12,213 నమోదయ్యాయి. ముందు రోజుకంటే కేసుల సంఖ్య 38.4 శాతం అధికంగా ఉండటం గమనార్హం.

బుధవారం దేశవ్యాప్తంగా 5 లక్షల 19వేలమందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12,213 మందికి పాజిటివ్‌ గా తేలింది. పాజిటివిటీ రేటు ఏకంగా 2.35 శాతానికి చేరింది. గడచిన నాలుగు నెలలుగా ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి లేదు. చివరిగా ఫిబ్రవరి చివరిలో పాజిటివిటీ రేటు 2 దాటింది. మళ్లీ ఇప్పుడు 2.35గా నమోదు కావడం విశేషం.

ఆ రెండు రాష్ట్రాలే కీలకం..

ఈ సారి మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు అత్యథికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర(4,024), కేరళ(3,488)తోపాటు ఢిల్లీ, కర్నాటక కూడా కేసుల వ్యాప్తిలో ప్రధాన భాగస్వాములు. మహారాష్ట్ర విషయానికొస్తే.. అక్కడ రాష్ట్రవ్యాప్తంగా బయటపడిన 4,024 కేసుల్లో.. ఒక్క ముంబైలోనే 2 వేల కేసులున్నాయి. ఈ ఏడాదిలో ముంబైలో అత్యథిక కేసులు ఇప్పుడే వెలుగు చూశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే.. వరుసగా రెండోరోజు 1,100 మంది కరోనా బారినపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 7,624 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం. వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 15.21 లక్షల మంది టీకా తీసుకున్నారు.

First Published:  16 Jun 2022 2:27 AM GMT
Next Story