Telugu Global
MOVIE UPDATES

సాయిపల్లవిపై మూకుమ్మడి దాడి.. రెచ్చిపోతున్న కాషాయదళం..!

నటి సాయిపల్లవిపై ఓ వర్గం మాటలదాడికి తెగబడుతోంది. ఆమె మూలాలను, కులాన్ని, రాష్ట్రాన్ని కూడా ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇక సాయిపల్లవి దక్షిణాదిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసుకున్న పాత్రలు మాత్రమే చేస్తూ.. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటోంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ఇలా అన్ని […]

sai-pallavi
X

నటి సాయిపల్లవిపై ఓ వర్గం మాటలదాడికి తెగబడుతోంది. ఆమె మూలాలను, కులాన్ని, రాష్ట్రాన్ని కూడా ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇక సాయిపల్లవి దక్షిణాదిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసుకున్న పాత్రలు మాత్రమే చేస్తూ.. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటోంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ఇలా అన్ని చిత్రాల్లోనూ ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేసింది.

తాజాగా ఆమె వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రేపు విడుదల కాబోతున్నది. నక్సలిజం వైపు ఆకర్షితురాలైన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

ఇటీవల కశ్మీర్ ఫైల్స్ అనే ఓ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. కశ్మీర్ లో పండిట్స్ ఎదుర్కొన్న హింస, కష్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే ఈ చిత్రంపై సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘కశ్మీర్ పండిట్లపై కొందరు అకృత్యాలకు పాల్పడ్డారు నిజమే.. కానీ మనదేశంలో గోవును తరలిస్తున్నారని కొందరిపై దాడులు జరుగుతున్నాయి కదా.. ఈ రెండు ఒకే తరహా దాడులు కదా.. వేటినీ మనం సమర్థించలేము‘ అని ఆమె అన్నారు.

దీంతో బీజేపీ కాషాయదళం రెచ్చిపోయింది. సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ప్రస్తుతం సాయిపల్లవికి అనుకూలంగా వ్యతిరేకంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సాయి పల్లవి తన అభిప్రాయాన్ని వెల్లడించిందని అది కూడా తప్పేనా? అని కొందరు ఆమెను సమర్థిస్తున్నారు. ఇక బీజేపీ అనుకూలురు మాత్రం.. ఆమె సినిమాను నిషేధించాలని కూడా పిలుపునిస్తుండటం గమనార్హం. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.

First Published:  16 Jun 2022 11:05 AM IST
Next Story