బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి వేధింపులు… ఓ మహిళతో సహా నలుగురు దళితుల ఆత్మహత్య యత్నం
ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళతో సహా నలుగురు దళితులు విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కర్నాటకలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే… కర్నాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలోని ఓల్డ్ షిడేనూర్ గ్రామంలో నివసించే 29 దళిత కుటుంబాలకు 2007-08లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక ఎకరం 15 గుంటల భూమి ఇచ్చింది. దళిత కుటుంబాలకు ఇచ్చిన భూమిలో గ్రామస్థుడు శేఖర్‌గౌడ్ పాటిల్ అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అతనికి […]
ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళతో సహా నలుగురు దళితులు విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కర్నాటకలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే…
కర్నాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలోని ఓల్డ్ షిడేనూర్ గ్రామంలో నివసించే 29 దళిత కుటుంబాలకు 2007-08లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక ఎకరం 15 గుంటల భూమి ఇచ్చింది. దళిత కుటుంబాలకు ఇచ్చిన భూమిలో గ్రామస్థుడు శేఖర్‌గౌడ్ పాటిల్ అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అతనికి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కుమారుడు మంజునాథ్ అండగా నిలిచాడు. ఆ భూముని శేఖర్‌గౌడ్ పాటిల్ కు ఇచ్చేయాలని చాలా కాలంగా దళిత కుటుంబాలను వేధిస్తున్నాడు. మంగళవారం నాడు కూడా మంజునాథ్ ఆ గ్రామానికి వచ్చి దళితులను బెదిరించాడు. ఆ భూమిని వదులుకోకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించాడు.
ఎమ్మెల్యే కుమారుడు మంజునాథ్ బెదిరింపులతో దళితులైన పాండప్ప కబ్బూరు, గంగవ్వ కబ్బూరు, హనుమంతప్ప బడిగేర్, గురుచప్ప లమానిలు విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గ్రామస్తులు వారిని హుటాహుటిన బ్యాడ్గి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం బాధితులు నలుగురిని దావణగెరె ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు మంజునాథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఓలేకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన తెలిసిన దళిత సంఘాలు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకొని గ్రామస్తులతో గొంతు కలిపాయి.
అయితే ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించి తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదని పోలీసులు అంటున్నారు.