Telugu Global
National

బీజేపీ నిర్వాకం… ఎర్రచందనం స్మగ్లరుకు కార్యదర్శి పదవి

ఒకప్పుడు నేరస్తులను రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేవి. ఇప్పుడు నేరస్తులు ఏకంగా పార్టీల ముఖ్యపదవుల్లో ఆసీనులవుతున్నారు. అలా ఓ ఎర్ర చందనం స్మగ్లర్ కు బీజేపీ పదవి కట్టబెట్టి విమర్షలపాలైంది. తమిళనాడులో కె. వెంకటేశన్ అనే వ్యక్తిపై ఏడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఈయన విదేశాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడు. గతంలో గూండా చట్టం కింద అరెస్టయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఆయనను ఆ‍ంధ్రప్రదేశ్ పోలీసులు కూడా […]

బీజేపీ నిర్వాకం… ఎర్రచందనం స్మగ్లరుకు కార్యదర్శి పదవి
X

ఒకప్పుడు నేరస్తులను రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేవి. ఇప్పుడు నేరస్తులు ఏకంగా పార్టీల ముఖ్యపదవుల్లో ఆసీనులవుతున్నారు. అలా ఓ ఎర్ర చందనం స్మగ్లర్ కు బీజేపీ పదవి కట్టబెట్టి విమర్షలపాలైంది.

తమిళనాడులో కె. వెంకటేశన్ అనే వ్యక్తిపై ఏడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఈయన విదేశాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడు. గతంలో గూండా చట్టం కింద అరెస్టయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఆయనను ఆ‍ంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం వెంకటేశన్ బెయిల్ పై ఉన్నాడు.

ఇంత నేర చరిత్ర ఉన్న వెంకటేశన్ ను తమిళనాడు బీజేపీ శాఖ జూన్ 13న ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. దీనిపై ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్షలు రావడంతో రెండుగంటల్లో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందాపార్టీ.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న వెంకటేశన్ గతంలో అన్నాడీఎంకేలో పని చేశారు. అతను అన్నాడీఎంకే యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన తర్వాత ఆయనను అన్నాడీఎంకే నుంచి తొలగించారు.

First Published:  15 Jun 2022 8:29 AM IST
Next Story