3 నెలలు సెల్ ఫోన్లు పక్కన పెట్టండి.. మంత్రి కేటీఆర్ సలహా..
జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దు.. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేటు రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు హితబోధ చేశారు మంత్రి కేటీఆర్. ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుందని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారాయన. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ధైర్యం చెప్పారు. […]
జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దు.. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేటు రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు హితబోధ చేశారు మంత్రి కేటీఆర్. ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుందని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారాయన. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ధైర్యం చెప్పారు. పోటీ పరీక్షలకోసం కష్టపడి చదవాలని, అదే సమయంలో అపజయం ఎదురైతే మాత్రం కుంగిపోవద్దని, జీవితం చాలా పెద్దదని చెప్పారు. మంత్రి కేటీఆర్ సడన్ గా మోటివేటర్ లాగా తమతో మాట్లాడటంతో విద్యార్థులు ఆసక్తిగా ఆయన ప్రసంగం విన్నారు.
సెల్ ఫోన్లతోనే ముప్పంతా..!
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సెల్ ఫోన్లను.. కేవలం సమాచారం సేకరించేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలని, అదే పనిగా ఫోన్లు వాదొడ్డని సూచించారు కేటీఆర్. మూడు నాలుగు నెలలపాటు సెల్ ఫోన్ పక్కనపెడితే విజయం మీదేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక నీళ్లు, నిధులు, నియామకాలని వివరించిన కేటీఆర్.. ఎనిమిదేళ్లలో సాగునీటి రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తి పోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించామని గుర్తుచేశారు. సాగునీటి సౌకర్యం ఏర్పాటుతో బీడు భూములు సస్య శ్యామలం అయ్యాయని.. భూముల రేట్లు ఎన్నో రెట్లు పెరిగాయని వెల్లడించారు. తలసరి ఆదాయం, జి.ఎస్.డి.పి.లో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే, తెలంగాణ ముందు ఉందని చెప్పారు.
ఉద్యోగాల భర్తీ ఇలా..
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కేటీఆర్. కొత్తగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. పరిశ్రమల స్థాపనను ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని అన్నారు. టీఎస్ ఐపాల్ ద్వారా 8 ఏళ్లలో 19 వేల పరిశ్రమల స్థాపనకు సహకారం ఇచ్చామని, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తెలంగాణ డిమాండ్ మేరకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 10 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అసలు కేంద్రంలో 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కేటీఆర్.