Telugu Global
National

20 గంటలు కాదు.. రాహుల్‌ని ప్రశ్నించింది 6 గంటలే.. – ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసులో తాము కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించింది 20 గంటలు కాదని 6 గంటలేనని ఈడీ అధికారులు తెలిపారు. సోమవారం 10 గంటలు, మంగళవారం కూడా సుమారు 10 గంటలు ఆయనను విచారించినట్టు వచ్చిన వార్తలు సరైన‌వి కాద‌ని స్పష్టంచేశారు. ఈడీ కార్యాలయంలో రాహుల్ నిన్న 21 గంటలు గడిపినట్టు కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయి. మూడో రోజైన బుధవారం కూడా రాహుల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిజానికి తాము ఆయనను ప్రశ్నించింది 6 […]

20 గంటలు కాదు.. రాహుల్‌ని ప్రశ్నించింది 6 గంటలే.. – ఈడీ
X

నేషనల్ హెరాల్డ్ కేసులో తాము కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించింది 20 గంటలు కాదని 6 గంటలేనని ఈడీ అధికారులు తెలిపారు. సోమవారం 10 గంటలు, మంగళవారం కూడా సుమారు 10 గంటలు ఆయనను విచారించినట్టు వచ్చిన వార్తలు సరైన‌వి కాద‌ని స్పష్టంచేశారు. ఈడీ కార్యాలయంలో రాహుల్ నిన్న 21 గంటలు గడిపినట్టు కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయి. మూడో రోజైన బుధవారం కూడా రాహుల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిజానికి తాము ఆయనను ప్రశ్నించింది 6 గంటలు మాత్రమేనని, సోమవారు 3 గంటలు, మంగళవారం కూడా సుమారు 3 గంటలు విచారించామని ఈడీ వర్గాలు వివరించాయి. ఇతర సమయమంతా ఆయన తన సమాధానాలను ప్రూఫ్ రీడింగ్ చేసుకుంటూ వచ్చారని, టైప్ చేసిన వీటిని తాము రివ్యూ చేసుకుంటూ, కరెక్ట్ చేస్తూ మళ్ళీ టైప్ చేయగా ఆయన వాటిపై సంతకాలు చేశారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

గత 2 రోజులుగా రాహుల్ స్టేట్ మెంట్లను మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద అనేకసార్లు రికార్డ్ చేయడం జరిగింది. మంగళవారం ఈడీ అధికారులతో ఆయన దాదాపు 21 గంటలపాటు ఇంటరాక్ట్ అయ్యారు. అని పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఈ వర్గాలు ప్రస్తావించాయి. కాగా సోమవారం నాడు తన స్టేట్ మెంట్లను రాహుల్ కూలంకషంగా చెక్ చేసుకుంటూ వచ్చారని, ఆ తరువాతే వాటి సబ్మిషన్ జరిగిందని ఇవి స్పష్టం చేశాయి.

అటు తమ నేతను విచారిస్తున్న సందర్భంగా ఈడీ అధికారులు ఎన్నో బ్రేకులు తీసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థల్లో పెట్టుబ‌డులు, వాటి ఆర్ధిక లావాదేవీల గురించి అధికారులు రాహుల్ ని గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలుస్తోంది. రాహుల్ ని ఒక విధంగా వేధిస్తున్నారని పరోక్షంగా ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రాహుల్ విచారణ జరిగేంతకాలం తమ నిరసన, ఆందోళన కొనసాగుతుందని టీ.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం గమనార్హం.

First Published:  15 Jun 2022 9:58 AM IST
Next Story