పొగరాయుళ్ళకూ ఓ ప్రభుత్వ పథకం!
ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు అనేక ఎత్తులు వేస్తుంటాయి. వాటిలో భాగంగానే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ఇటీవల కాలంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నగదు బదిలీ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకూ ఏదో రూపంలో ఏదో ఒక పథకం అందుతోంది. కానీ వ్యసనంగా భావించే స్మోకింగ్ (పొగతాగడం)ను మాన్పించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తున్నది ఓ ప్రభుత్వం. ఆసక్తి కలిగించే ఈ పథకం వివరాలేంటో మనమూ తెలుసుకుందాం.. పొగతాగడం వల్ల అనారోగ్యం […]
ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు అనేక ఎత్తులు వేస్తుంటాయి. వాటిలో భాగంగానే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ఇటీవల కాలంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నగదు బదిలీ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకూ ఏదో రూపంలో ఏదో ఒక పథకం అందుతోంది. కానీ వ్యసనంగా భావించే స్మోకింగ్ (పొగతాగడం)ను మాన్పించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తున్నది ఓ ప్రభుత్వం. ఆసక్తి కలిగించే ఈ పథకం వివరాలేంటో మనమూ తెలుసుకుందాం..
పొగతాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఒక వినూతన్న ఆలోచన చేసింది.
స్మోకింగ్ పూర్తిగా మానేసిన వారికి అందుకు గాను కొంత డబ్బును ఇవ్వాలని నిర్ణయించి ఓ పథకాన్ని రూపొందించింది అధికార యంత్రాంగం. పొగతాగడం మానేసిన వారికి రూ.20 వేలు, పొగమానేసిన గర్భిణిలకు రూ.40 వేలు ఇచ్చేలా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం వల్ల ప్రజలు కచ్చితంగా మారతారని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇంతకీ ఈ పథకం ఎక్కడ అమలవుతోందంటే..ప్రస్తుతం ఈ పథకం యునైటెడ్ కింగ్ డమ్ లోని చెషైర్ ఈస్ట్ నగరంలో అమలులో ఉంది.
ఎలా గుర్తిస్తారంటే..?
ఈ పథకం ప్రకారం.. రూ.20, రూ.40 వేలను రివార్డుగా ప్రకటించారు, కానీ దానికి అర్హులు కావాలంటే.. పొగతాగడం పూర్తిగా మానేశామని వారే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి (ఆడ అయినా మగ అయినా)స్మోకింగ్ మానేసినట్లు చెప్పినప్పుడు.. వారికి శ్వాస పరీక్షలు చేస్తారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ పరీక్షలలో పొగ మానేసిందీ లేనిదీ తెలుస్తుందట. ఆ ఫలితం ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు. ఈ పథకం అమలు కాకముందు చెషైర్ ఈస్ట్‌లో 10.8 శాతం మంది పొగతాగే వారుండగా, ఇప్పుడు 10.5 శాతానికి తగ్గింది. ఇందులో గర్భిణులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. ముందు ముందు మరింత మంది పొగ మానేయవచ్చని అధికార యంత్రాంగం ఆశిస్తోంది.
ప్రజలను ఈ వ్యసనం నుంచి మానిపించేందుకు అక్కడి ప్రభుత్వం 116,500 యూరోలు (ఇండియన్ కరెన్సీలో సుమారు 10 మిలియన్ల) బడ్జెట్ ను కేటాయించారు. ప్రజలు పొగతాగడం మానేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉండడమే కాక ఆర్ధికంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అక్కడి ఓ సర్వే ప్రకారం రోజుకు 20 మంది ధూమపానం చేసేవారు యేడాదికి సుమారుగా రూ. 4.4 లక్షలు ఖర్చు చేస్తారుట. స్మోకింగ్ మానేయడం ద్వారా దీనిని నివారించవచ్చు అంటున్నారు. ఈస్ట్ చెషైర్‌లో ఈ పథకం సరైన ఫలితాలను ఇస్తే, ఇతర నగరాల్లో కూడా ఇది అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.
మళ్లీ పొగతాగరని గ్యారెంటీ ఏంటి..? అంటే దానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసే ఉంటుంది. మరి మన దేశంలో కేంద్రం, ప్రతీ రాష్ట్రం, ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. మరి ఈ పథకం కూడా అమలు చేస్తారేమో చూద్దాం.!