Telugu Global
National

రేపటి దీదీ సమావేశానికి హాజరుకానున్న టీఆర్ఎస్?

రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే కూటమికి విజయానికి సరిపడా ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు లేకపోవడంతో.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ మద్దతు ఇస్తే ఎన్టీయే అభ్యర్థి గెలవడం సునాయాసమే. కానీ విపక్షాల తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టి, మేమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఈ బాధ్యతను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన భుజాన వేసుకున్నారు. ఈ […]

రేపటి దీదీ సమావేశానికి హాజరుకానున్న టీఆర్ఎస్?
X

రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే కూటమికి విజయానికి సరిపడా ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు లేకపోవడంతో.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ మద్దతు ఇస్తే ఎన్టీయే అభ్యర్థి గెలవడం సునాయాసమే. కానీ విపక్షాల తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టి, మేమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఈ బాధ్యతను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో దేశంలోని 22 పార్టీలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపించారు.

కాగా, గత కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పేరుతో ఒక జాతీయ పార్టీకి కూడా రంగం సిద్దం చేస్తున్నారు. భవిష్యత్‌లో విపక్షాల అవసరం కూడా తనకు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దీదీ నిర్వహిస్తున్న సమవేశానికి తాను స్వయంగా హాజరు కాకపోయినా.. టీఆర్ఎస్ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ఈ నెల 19న పార్టీకి సంబంధించి కీలక సమావేశం నిర్వహించనుండటంతోనే, కేసీఆర్ రేపటి సమావేశానికి హాజరు కావడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సీపీఎం పార్టీ దీదీ సమావేశానికి రావడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ సమావేశానికి రాకపోవడానికి గల కారణం ఏంటో మాత్రం వివరించలేదు.

రేపటి కీలక సమావేశానికి ముందు ఇవాళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మమత భేటీ అయ్యారు. విపక్షాల తరపున ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శరద్ పవర్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన మమతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. విపక్షాల తరపున ఆయన అయితేనే సరైన అభ్యర్థి అని పవర్‌ను ఓప్పిస్తారా? లేదంటే మరో ఉమ్మడి అభ్యర్థి ఎవరనే విషయం చర్చిస్తారా అనేది తెలియాల్సి ఉన్నది.

First Published:  14 Jun 2022 3:07 PM IST
Next Story