Telugu Global
NEWS

గవర్నరా,బీజేపీ కార్య‌కర్తా ? ‍సోషల్ మీడియాలో ట్రోలింగ్

గవర్నర్ల వ్యవ‌స్థపై వ్యతిరేకత ఈనాటిది కాదు. గవర్నర్లు కేంద్రంలో పాలిస్తున్న పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఈనాటివి కావు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1959 లో కేరళలో E M S నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుండి ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలయ్యింది. ఇందిరా గాంధీ కూడా గవర్నర్లను తన ఏజెంట్లుగానే ఉపయోగించుకుంది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చాక గవర్న‌ర్లను తమ […]

tamilisai
X

గవర్నర్ల వ్యవ‌స్థపై వ్యతిరేకత ఈనాటిది కాదు. గవర్నర్లు కేంద్రంలో పాలిస్తున్న పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఈనాటివి కావు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1959 లో కేరళలో E M S నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుండి ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలయ్యింది. ఇందిరా గాంధీ కూడా గవర్నర్లను తన ఏజెంట్లుగానే ఉపయోగించుకుంది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చాక గవర్న‌ర్లను తమ పార్టీకి అనుకూలంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో తమ అధికార ప్రతినిధులుగా మార్చేసిందనే ఆరోపణలున్నాయి.. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై కార్యాచరణ బీజేపీ కార్యకర్తలాగే ఉందనే ఆరోపణలు ఉవ్వెత్తున వస్తున్నాయి.

ప్రభుత్వం ఏం చేసినా గవర్నర్ వ్యతిరేకిస్తున్నారనే విమర్ష‌లతో పాటు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నట్టుగా కూడా ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నామినేట్ చేసిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఒప్పుకోకుండా ఫైల్ పెండింగ్ లో పెట్టిన దగ్గరి నుంచి కేసీఆర్ ప్రభుత్వం పై రోజూ విమర్షలు, ప్రభుత్వానికి పోటీగా మహిళా దర్బార్ నిర్వహణ దాకా గవర్నర్ పై టీఆరెస్ గుస్సాగానే ఉంది.

ఇక ఆమె చేసే పనుల పట్ల , చూపించే పక్షపాతం పట్ల సోషల్ మీడియాలో కూడా అనేక సార్లు ట్రోలింగ్ జరిగింది. ఇవ్వాళ్ళ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో గవర్నర్ తమిళిసై మీద నెటిజనులు ట్రోలింగ్ కు దిగారు. అసలు జరిగిందేంటి ?

రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో 10 లక్షల మందిని ప్రభుత్వం ఉద్యోగాల్లో నియమిస్తామని ప్రధాని ఇవ్వాళ్ళ ప్రకటించారు. ఆ వార్తను తెలంగాణ గవర్నర్ తమిళిసై ‘కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుండి రీ-ట్వీట్ చేశారు.. దానిపై నెటిజనులు విరుచుకపడుతున్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 91,142 ఉద్యోగాలను ప్రకటించినప్పుడు కనీసం పట్టించుకోని గవర్నర్ మోదీ పది లక్షల ఉద్యోగాల గురించి ట్వీట్ చేయడమేంటని, అందులో పక్షపాతం లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.

గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సాధారణ బీజేపీ కార్యకర్త లాగా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది గవర్నర్ తీరు ఆ పదవికి అగౌరవాన్ని తెచ్చిపెడుతున్నదని విమర్శించారు.

”గతంలో ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? గతంలో ఇచ్చిన హామీ మేరకు నల్లధనం తీసుకొచ్చారా? కనీసం 30,000 ఉద్యోగాలు సృష్టించగల తెలంగాణకు ఐటీఐఆర్ ఇచ్చారా?
ఈ 10 లక్షల ఉద్యోగాలు కూడా కేవలం మరొక జుమ్లా.” అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.

”దేశంలో 60 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి మిగతా 50 లక్షల సంగతేంటి మేడం” అని మరొకాయన‌ ట్వీట్ చేశారు.

”పాపం ఆమెను ఏమీ అనకండి స్వంత పార్టీ కదా ఆబ్లిగేషన్స్ ఉంటాయి.” అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మొత్తానికి తెలంగాణ గవర్నర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏ గవర్నర్ కూడా ఎదుర్కోనన్ని విమర్షలు, ట్రోలింగ్ లు ఎదుర్కుంటున్నారు. ఇది గవర్నర్ల వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లిపోవడానికి గుర్తు కాదా ?

First Published:  14 Jun 2022 9:33 AM IST
Next Story