Telugu Global
National

మహారాష్ట్రలో థానే పోలీసు స్టేషన్ హ్యాక్ ! అదే వరస! క్షమాపణ చెప్పాల్సిందే !

మహారాష్ట్రలోని థానే పోలీసు స్టేషన్ నే తన టార్గెట్ గా చేసుకున్నాడో హ్యాకర్ ! మంగళవారం ఉదయమే స్టేషన్ కి వచ్చిన పోలీసులు తమ వెబ్ సైట్ హ్యాక్ కావడం చూసి షాక్ తిన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్న ఓ మెసేజ్ కూడా హ్యాకర్ జోడించాడట.. తమ సైట్ హ్యాకింగ్ కి గురి అయిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు. తమ ఫిర్యాదుపై థానే సైబర్ క్రైమ్ […]

thane-police-station
X

మహారాష్ట్రలోని థానే పోలీసు స్టేషన్ నే తన టార్గెట్ గా చేసుకున్నాడో హ్యాకర్ ! మంగళవారం ఉదయమే స్టేషన్ కి వచ్చిన పోలీసులు తమ వెబ్ సైట్ హ్యాక్ కావడం చూసి షాక్ తిన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్న ఓ మెసేజ్ కూడా హ్యాకర్ జోడించాడట.. తమ సైట్ హ్యాకింగ్ కి గురి అయిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు. తమ ఫిర్యాదుపై థానే సైబర్ క్రైమ్ టీమ్ దర్యాప్తు చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ‘హ్యక్డ్ బై వన్ హ్యాట్..సైబర్ టీమ్’ అనే వాక్యాలు కనిపించాయన్నారు. పైగా ‘హలో ! ఇండియన్ గవర్నమెంట్ ! ఇస్లామిక్ మతానికి సంబంధించి ప్రతిసారీ మీరు సమస్యను సృష్టిస్తున్నారు..

ఇక ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని ముస్లింలందరికీ మీరు ఆపాలజీ చెప్పాల్సిందే..అంతవరకు మేము విశ్రమించేది లేదు’ అని ఆ హ్యాకర్ డిమాండ్ చేశాడు. అయితే కొద్దీ సేపటికి ఈ వెబ్ సైట్ లో ఈ మెసేజ్ ని అప్పుడే డిలీట్ చేసినట్టు కనిపిస్తోంది. నల్లటి స్క్రీన్ పై ‘అండర్ మెయింటెనెన్స్’ అన్న అక్షరాలు దర్శనమిచ్చాయి. దీనిపై సైబర్ నిపుణులు ఆరా తీయడం ప్రారంభించారు. ‘వన్ హ్యాట్ సైబర్ టీమ్’ అనే హ్యాకర్ గ్రూప్ ఇండోనేసియా నుంచి ‘పని’ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమది ‘కమ్యూనిటీ ఆర్గనైజేషన్’ అని, స్వేచ్ఛకు న్యాయం జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఈ బృందం తమ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. ఈ బృందానికి ఓ బ్లాగ్ పోస్ట్ వెబ్ పేజ్ కూడా ఉందని, కానీ ఇందులోని సమాచారం ఇండోనేసియా భాషలో ఉందని తెలుస్తోంది. ఈ పేజ్ లో కొన్ని కోడ్స్, స్క్రిప్ట్స్ కూడా ఉన్నట్టు సమాచారం.

అసలే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలోని ముస్లింలు, కొన్ని ఇస్లామిక్ దేశాలు సైతం భగ్గుమంటుండగా తాజాగా థానే పోలీసు స్టేషన్ వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, హ్యాకర్ ఎవరో, అసలు ఏ గ్రూప్ ఇలా చేసిందో కనుగొంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. దేశంలోని సుమారు 70 వెబ్ సైట్లను హ్యాక్ చేశారని వచ్చిన వార్తలు ఇప్పటికీ సైబర్ నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

First Published:  14 Jun 2022 8:37 AM IST
Next Story