Telugu Global
National

సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

సహజీవనం చట్టబద్ధమా, కాదా అన్న వ్యవహారంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పింది. సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని, సహజీవనంలో కలిగే పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఓ జంట భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది. కేరళకు చెందిన […]

Supreme-Court-Live-in-Relation
X

సహజీవనం చట్టబద్ధమా, కాదా అన్న వ్యవహారంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పింది. సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని, సహజీవనంలో కలిగే పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఓ జంట భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది.

కేరళకు చెందిన ఓ జంట వివాహం చేసుకోకుండానే కలసి ఉంది. వారిద్దరూ భార్యాభర్తల్లానే మెలిగేవారు. ఆ కారణంగా వారికి ఓ బిడ్డ పుట్టాడు. కొన్నాళ్లకు కొడుకుని, ఆమె తల్లిని.. అతను దూరం పెట్టాడు. జీవన భృతికోసం, ఆస్తిలో వాటాకోసం వారు చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు. కేరళ హైకోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాలు లేని కారణంగా వారికి పుట్టిన బిడ్డను అక్రమ సంతానంగా భావించాలని చెప్పింది. ఆ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని పేర్కొంటూ 2009లో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తాజాగా కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేరళ హైకోర్టు తీర్పును విభేదించింది. ఓ జంట దీర్ఘకాలం పాటు సహజీవనం చేశారంటే వారికి వివాహం జరిగినట్టుగానే భావించాలని.సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 144 ఇదే విషయాన్ని చెబుతోందని పేర్కొంది. అయితే బంధువులు కానీ, బయట వ్యక్తులు కానీ ఎవరైనా దీన్ని సవాల్ చేయవచ్చని కూడా తెలిపింది. అయితే ఆ బిడ్డ వారికి పుట్టలేదని రుజువు చేసే బాధ్యత కూడా అలా సవాల్ చేసినవారిపైనే ఉంటుందని చెప్పింది. వారు కలసి జీవించలేదు అని రుజువైతే తప్ప వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది.

First Published:  14 Jun 2022 9:59 AM IST
Next Story