జస్టిస్ సత్యనారాయణపై అమరావతివాదుల పూలవర్షం
అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సత్యనారాయణమూర్తి పదవి విరమణ చేసి వెళ్తున్న సమయంలో అమరావతివాదులు పూల వర్షం కురిపించారు. రోడ్లుకు ఇరువైపుల నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. వారికి జస్టిస్ సత్యనారాయణమూర్తి అభివాదం చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కఠినమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అయి వెళ్తున్న సమయంలోనూ అమరావతివాదులు ఇదే తరహాలో పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. జస్టిస్ సత్యనారాయణ మూర్తి […]
అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సత్యనారాయణమూర్తి పదవి విరమణ చేసి వెళ్తున్న సమయంలో అమరావతివాదులు పూల వర్షం కురిపించారు. రోడ్లుకు ఇరువైపుల నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. వారికి జస్టిస్ సత్యనారాయణమూర్తి అభివాదం చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కఠినమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అయి వెళ్తున్న సమయంలోనూ అమరావతివాదులు ఇదే తరహాలో పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. జస్టిస్ సత్యనారాయణ మూర్తి పదవి కాలం ముగిసేందుకు కొద్దిరోజుల ముందే ఆయన్ను హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫార్సుతో నియామకానికి ఓకే చేసింది కేంద్రం.
తన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి.. తనతో కయ్యానికి కాలు దువ్వినా తాను వెనుకడుగు వేయలేదంటూ వ్యాఖ్యానించారు. పౌర హక్కులకు రక్షకులుగా ఉండాల్సిన వారే కయ్యానికి కాలు దువ్విన వాతావరణాన్ని తాను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. అయితే ఈపరిణామాలు తనలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకపోగా.. రెట్టింపు చేశాయన్నారు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు మాత్రం బాధపడ్డారన్నారు.
తన పదవీకాలంలో ప్రభుత్వ చర్యల కారణంగా, అడ్వకేట్ జనరల్ చేసిన వాదనల వల్ల తాను అనేక కొత్త విషయాలను, కొత్త కోణాలను నేర్చుకునే అవకాశం దక్కిందన్నారు. తన వీడ్కోలు కార్యక్రమానికి అడ్వకేట్ జనరల్ హాజరుకాకపోయినప్పటికీ ఆయనకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని సత్యనారాయణమూర్తి అన్నారు.
ఏపీ హైకోర్టులో జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఒక ఆల్‌రౌండర్ అని, సచిన్ లాంటి వారని చీఫ్ జస్టిస్ మిశ్రా ప్రశంసించారు. ఏపీ హైకోర్టులో ఆయన 31వేల 202 కేసులను పరిష్కరించారన్నారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తి, ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయన భార్య ఎంవీ రమణకుమారిని హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానించింది.