పవన్ కి ఏవైనా 3 ఉండాల్సిందే.. అందుకే మూడు ఆప్షన్లు ఇచ్చారు..
పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఆయన్ను కామెంట్ చేయడం వైసీపీ నేతలకు ఓ సరదా. గతంలో పేర్ని నాని, బొత్స.. పలు సందర్భాల్లో పవన్ ని ఇదే విషయంలో కామెంట్ చేశారు, కార్నర్ చేశారు. ఆ తర్వాత పవన్ నొచ్చుకోవడంతో అలాంటి సెటైర్లు కాస్త తగ్గాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్.. మరోసారి పవన్ పై అలాంటి కామెంట్లు చేశారు. ఆయనకు ఏవైనా మూడు ఉండాలని, అందుకే మూడు ఆప్షన్ లు ఇచ్చారని అన్నారు. […]
పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఆయన్ను కామెంట్ చేయడం వైసీపీ నేతలకు ఓ సరదా. గతంలో పేర్ని నాని, బొత్స.. పలు సందర్భాల్లో పవన్ ని ఇదే విషయంలో కామెంట్ చేశారు, కార్నర్ చేశారు. ఆ తర్వాత పవన్ నొచ్చుకోవడంతో అలాంటి సెటైర్లు కాస్త తగ్గాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్.. మరోసారి పవన్ పై అలాంటి కామెంట్లు చేశారు. ఆయనకు ఏవైనా మూడు ఉండాలని, అందుకే మూడు ఆప్షన్ లు ఇచ్చారని అన్నారు. ముగ్గురు కాదు పదిమంది వచ్చినా జగన్ ని ఓడించడం వారి తరం కాదని చెప్పారు.
ఆయనది వన్ సైడ్ లవ్.. ఈయనది నో లవ్..
74 ఏళ్ల చంద్రబాబు నాయుడు తనది వన్ సైడ్ లవ్ అని, తనను ఎవరూ ప్రేమించడం లేదని బాధపడుతున్నారని.. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ప్రజల ప్రేమకు దూరమయ్యారని సెటైర్లు పేల్చారు అమర్ నాథ్. ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ప్రజల అభిమానం లేక పవన్ కల్యాణ్ పోటీ చేసిన ప్రతి చోటా ఓడిపోతుంటారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ముసలి పార్టీకి లవర్స్ కూడానా..?
చంద్రబాబు ముసలోడైపోయారని, ఆయన పార్టీ కూడా ముసలి పార్టీ అని అన్నారు అమర్ నాథ్. ప్రేమికులు ఎవరైనా దొరుకుతారేమోనని.. టీడీపీ వాళ్లు అనకాపల్లిలో తిరుగుతున్నారని, రెండురోజులపాటు సమావేశాలు పెట్టుకున్నారని అన్నారు. అనకాపల్లిలో స్థానిక టీడీపీ దోపిడీ దొంగలు సీటు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.