Telugu Global
National

అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ ఎంపీ

ఎంఐఎం అధినేత‌ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై వరుణ్ గాంధీ ఇటీవల తీవ్రంగా స్పంధించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మంజూరైన 60 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయంటూ గణాంకాలు బయటపెట్టారు. అసదుద్దీన్ ఇటీవల చేసిన ప్రసంగంలో ఆ గణాంకాలను పేర్కొన్నారు. తాను విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించిన అసదుద్దీన్‌కు వరుణ్ కృతజ్ఞతలు చెబుతూ ఆయన ప్రసంగ వీడియోను షేర్ చేశారు. ‘‘నిరుద్యోగంపై నా ప్రశ్నలను తన ప్రసంగంలో […]

asad
X

ఎంఐఎం అధినేత‌ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై వరుణ్ గాంధీ ఇటీవల తీవ్రంగా స్పంధించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మంజూరైన 60 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయంటూ గణాంకాలు బయటపెట్టారు. అసదుద్దీన్ ఇటీవల చేసిన ప్రసంగంలో ఆ గణాంకాలను పేర్కొన్నారు. తాను విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించిన అసదుద్దీన్‌కు వరుణ్ కృతజ్ఞతలు చెబుతూ ఆయన ప్రసంగ వీడియోను షేర్ చేశారు. ‘‘నిరుద్యోగంపై నా ప్రశ్నలను తన ప్రసంగంలో లేవనెత్తినందుకు ఒవైసీ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని వరుణ్ గాంధీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశంలో ఇప్పుడు నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన వరుణ్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. అప్పుడు మాత్రమే దేశం శక్తిమంతమవుతుందని పేర్కొన్నారు.

పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలను వివరిస్తూ వరుణ్ గాంధీ ఇటీవల గ్రాఫిక్స్ ద్వారా వివరాలను వెల్లడించారు. గత మూడు దశాబ్దాల్లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్న విషయాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మంజూరైన 60 లక్షల పోస్టులు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరక్క కోట్లాదిమంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని వరుణ్ పేర్కొన్నారు. మరి వాటికి కేటాయించిన బడ్జెట్ ఏమవుతోందని ప్రశ్నించారు. యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలని వరుణ్ సూచించారు. కాగా, ఇటీవల ఆయన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను లేవనెత్తుతూ సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు.

First Published:  13 Jun 2022 9:16 PM GMT
Next Story