కేంద్రం నుంచి నిధులు రాక కిందమీద పడుతున్నాం- జగన్
కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా కింద మీద పడైనా సరే రైతులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం వైఎస్ జగన్. రైతుల పంట బీమా పరిహారం 2,977 కోట్ల రూపాయలను సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతుల ఖాతాలోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అక్కడే బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు ఒకవైపు ప్రభుత్వం మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. […]
కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా కింద మీద పడైనా సరే రైతులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం వైఎస్ జగన్. రైతుల పంట బీమా పరిహారం 2,977 కోట్ల రూపాయలను సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతుల ఖాతాలోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అక్కడే బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు ఒకవైపు ప్రభుత్వం మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ధాన్యం డబ్బులు తాము తీర్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వకున్నా కింద మీద పడుతూనే రైతులను ఆదుకుంటున్నానని..అందుకు క్రాప్ హాలీడే పెడుతున్నారా అని ప్రతిపక్షాలను సీఎం ప్రశ్నించారు.
పదో తరగతిలో 67 శాతం విద్యార్థులు పాస్ అయ్యారని, గుజరాత్‌లో 65 శాతం మందే పాస్ అయ్యారన్నారు. దేశంలో కోవిడ్ నేపథ్యంలో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. చివరకు పిల్లలను కూడా రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. ప్రపంచంతో పోటీ పడే నాణ్యమైన విద్యా అవసరం లేదా అని ప్రశ్నించారు.
మంచి పని చేసే ప్రతిసారీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు అందరూ ఏకమై లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పనిచేసే దత్తపుత్రుడే పవన్ అని వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను ఎగొట్టిన చంద్రబాబు మాత్రం వీరికి మంచి వాడిలా కనిపిస్తున్నారన్నారు. పరిహారం అందని ఒక్క కౌలు రైతు కుటుంబానైనా చూపాలని తాము సవాల్ చేస్తే చంద్రబాబు, దత్తపుత్రుడు ఇప్పటికీ స్పందించలేదన్నారు.
కోనసీమ జిల్లాకు మహానుభావుడు అంబేద్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక అక్కడ అల్లర్లు చేయించారని ఆరోపించారు. ఒక దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారని విమర్శించారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. ఈరోజు తన ప్రభుత్వంలో 70 శాతం మంది మంత్రులు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలే ఉన్నారన్నారు.
సీపీఎస్, ఇతర అంశాల్లో మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజల ఆశీస్సులుంటే తాను ఎదుర్కొంటానన్నారు. ఏపీలో అమూల్ వచ్చిన తర్వాతనే మిగిలిన పాల కంపెనీలు ధరలు పెంచాయని గుర్తు చేశారు.