చిరంజీవి సినిమాలో పాత్ర.. నో చెప్తున్న యంగ్ హీరో, హీరోయిన్లు
తెలుగు సినిమాను ఎన్నో ఏళ్లు తన వైవిధ్యమైన పాత్రలతో అలరించిన చిరంజీవి ప్రస్తుతం కెరీర్ చివరి దశకు చేరుకున్నట్లే కనపడుతున్నాడు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపిస్తే చాలని యంగ్ హీరోలు భావించే వాళ్లు. కానీ ప్రస్తుతం చిరు పరిస్థితి మారిపోయింది. మెగాస్టార్ చిరు సినిమాలో ఛాన్స్ వచ్చినా, మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. ఆచార్య, అంతకు ముందు ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఏకంగా తన కొడుకు చరణ్‌కు చిన్న పాత్రలు అప్పగించారు. ఆచార్య […]
తెలుగు సినిమాను ఎన్నో ఏళ్లు తన వైవిధ్యమైన పాత్రలతో అలరించిన చిరంజీవి ప్రస్తుతం కెరీర్ చివరి దశకు చేరుకున్నట్లే కనపడుతున్నాడు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపిస్తే చాలని యంగ్ హీరోలు భావించే వాళ్లు. కానీ ప్రస్తుతం చిరు పరిస్థితి మారిపోయింది. మెగాస్టార్ చిరు సినిమాలో ఛాన్స్ వచ్చినా, మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. ఆచార్య, అంతకు ముందు ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఏకంగా తన కొడుకు చరణ్‌కు చిన్న పాత్రలు అప్పగించారు. ఆచార్య సినిమాలో చరణ్‌తో పాటు సత్యదేవ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేక ఫ్లాప్ అయ్యింది.
తాజాగా వేదాళం సినిమాలో ఒక పాత్ర కోసం కూడా కుర్ర హీరోలతో పాటు కాస్త పేరున్న నటులను సంప్రదిస్తున్నారట. అయినా సరే ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని సమాచారం. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, రవితేజ వంటి హీరోలను ప్యాడింగ్ కోసం సంప్రదించారు. అది పెద్ద పాత్ర కాకపోవడంతో ఎవరూ ఓప్పుకోవడం లేదని తెలుస్తున్నది.
యువ నటుడు నాగశౌర్యను ఆ పాత్ర కోసం అడిగితే నిర్మొహమాటంగా నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు నితిన్‌ను అడిగినా చేయలేనని చెప్పాడట. దీంతో ఆ పాత్ర కోసం నటీనటులను చిత్ర బృందం ఇంకా వెతుకుతూనే ఉన్నది.
ఇక హిట్స్ మీద జోరు మీద ఉన్న సాయి పల్లవి కూడా అంతకు ముందు చిరంజీవి సినిమాలో పాత్రకు నో చెప్పింది. చిరంజీవి అంటే నాకు ఎంతో ఇష్టం, ఆయన డ్యాన్స్‌కు పెద్ద అభిమానిని కానీ ఆయన సినిమా ‘భోళా శంకర్’లో అవకాశం వస్తే వద్దనుకున్నాను. ఎందుకంటే అదొక రీమేక్ సినిమా. ఒరిజినల్ వెర్షన్‌తో అందరూ తప్పకుండా కంపేర్ చేస్తారు. పొరపాటున నా పాత్ర నచ్చకపోతే ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్స్ తప్పవు. అందుకే పాత్ర వద్దనుకున్నాను అని చెప్పుకొచ్చింది.
ఏదేమైనా చిరంజీవి సినిమాలో నటించడానికి యంగ్ హీరో, హీరోయిన్లు మాత్రం వెనకడుగు వేస్తున్నట్లే కనపడుతున్నది.