గాంధీ కుటుంబ ఆస్తులను రక్షించేలా ఈడీపై ఒత్తిడి తెస్తున్నారు.. స్మృతి ఇరానీ
నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబ ఆస్తులను రక్షించేలా ఈడీ వంటి దర్యాప్తు సంస్థలమీద ఒత్తిడి తెస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోందని, అయితే ఢిల్లీలో ఈ సత్యాగ్రహాలు, నిరసనలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. వాళ్ళ అవినీతి బాహాటంగా పతాక శీర్షికలకెక్కినందుకేనా ఇదంతా అన్నారు. పైగా గాంధీ కుటుంబ ఆస్తులను పరిరక్షించేందుకు ఈడీ వంటి సంస్థలమీద ఒత్తిడి తెస్తున్నారని ఆమె అన్నారు. 1930 ప్రాంతంలో […]
నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబ ఆస్తులను రక్షించేలా ఈడీ వంటి దర్యాప్తు సంస్థలమీద ఒత్తిడి తెస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోందని, అయితే ఢిల్లీలో ఈ సత్యాగ్రహాలు, నిరసనలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. వాళ్ళ అవినీతి బాహాటంగా పతాక శీర్షికలకెక్కినందుకేనా ఇదంతా అన్నారు. పైగా గాంధీ కుటుంబ ఆస్తులను పరిరక్షించేందుకు ఈడీ వంటి సంస్థలమీద ఒత్తిడి తెస్తున్నారని ఆమె అన్నారు. 1930 ప్రాంతంలో సుమారు 5 వేలమంది స్వాతంత్య్ర యోధులు షేర్ హోల్డర్లుగా అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఏర్పాటైందని, కానీ ఈ రోజు ఆ సంస్థను గాంధీ కుటుంబం చేజిక్కించుకుందని ఆమె విమర్శించారు.
వార్తా పత్రికలను ప్రచురించే ఉద్దేశం ఈ సంస్థది కాగా.. 2008 లో తాము వార్తలను ప్రచురించబోమని, రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగుతామని ఆ కంపెనీ ప్రకటించినట్టు కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. 90 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ డబ్బును పార్టీకి ఎవరు విరాళంగా ఇచ్చారు ? ఈ సొమ్మును ఆ పార్టీ ప్రజా ప్రయోజనాలకు వినియోగించేబదులు గాంధీ కుటుంబం లాభం పొందేలా ఉపయోగించుకున్నదని మీకు తెలుసా అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. తమ ఆస్తులను పరిరక్షించుకునేలా ఆ కుటుంబం అనేకమందిని ఆహ్వానించిందని, దాని రాజకీయ ఎత్తుగడల గురించి చెప్పుకోవాలసింది ఎంతో ఉందని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైన సందర్భంలో ఈ డ్రామాలేమిటన్నారు.
కాంగ్రెస్ అవినీతిని సెలబ్రేట్ చేసుకుంటోందన్న సాంబిత్ పాత్రా
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు కాగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు, మార్చ్ లు నిర్వహించడం చూస్తే అవినీతిని అది (కాంగ్రెస్) సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ కేసు ద్వారా తమ బీజేపీ.. రాజకీయ వైషమ్యాన్ని చాటుకొంటున్నదన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిలోనూ సత్యాగ్రహమనే దాన్ని ఎలా వినియోగించుకోవాచో ప్రపంచం నేడు చూస్తోందని, సత్యంకోసం పోరాడాలని నాడు గాంధీజీ పిలుపునిచ్చారని ఆయన అన్నారు.
ఈ కేసులో రాహుల్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.. ఇది పొలిటికల్ కేసు కాదు అని వ్యాఖ్యానించారు. తాను 500 కోట్లు కొల్లగొట్టానని రాహుల్ గాంధీ ఈడీ ఎదుట నిజాన్ని ఒప్పుకోవలసిందే అని సాంబిత్ పాత్రా పేర్కొన్నారు. అసలు ఈడీని ఎదుర్కోవాలంటే గాంధీ కుటుంబం భయపడుతోందన్నారు. మొదట ఈ కేసులో ‘సత్యం’ గురించిన వాస్తవాలను కాంగ్రెస్ బయటపెట్టాలని, ఆ తరువాతే సత్యాగ్రహం గురించి మాట్లాడాలని పాత్రా వ్యంగ్యంగా ఛలోక్తి విసిరారు.