Telugu Global
National

కొనసాగుతున్న ‘నూపుర్ సీరియల్’ ! వెబ్ సైట్ల హ్యాకింగ్…. డ్రాగన్ ఫోర్స్ మలేసియా కింగ్

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకా ‘చిచ్ఛు’ రేపుతూనే ఉన్నాయి. వాటికి నిరసనగా ఇండియాలో అనేకచోట్ల ఆత్మాహుతి దాడులకు దిగుతామంటూ అల్-ఖైదా చేసిన హెచ్చరికల తరువాత.. దేశంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ సైట్ల మీద సైబర్ దాడులు పెరగడం ప్రారంభించాయి. వీటి వెనుక అల్-ఖైదా హస్తం ఉండినా ఉండవచ్చునని భావిస్తున్నారు. డ్రాగన్ ఫోర్స్ మలేసియా అనే హ్యాకర్ గ్రూప్ ఆధ్వర్యాన మొదట ఇజ్రాయెల్ లోని భారత దౌత్యకార్యాలయం […]

indian-government-web-sites-face-cyber-attacks-after-al-qaida-threat
X
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకా ‘చిచ్ఛు’ రేపుతూనే ఉన్నాయి. వాటికి నిరసనగా ఇండియాలో అనేకచోట్ల ఆత్మాహుతి దాడులకు దిగుతామంటూ అల్-ఖైదా చేసిన హెచ్చరికల తరువాత.. దేశంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ సైట్ల మీద సైబర్ దాడులు పెరగడం ప్రారంభించాయి. వీటి వెనుక అల్-ఖైదా హస్తం ఉండినా ఉండవచ్చునని భావిస్తున్నారు. డ్రాగన్ ఫోర్స్ మలేసియా అనే హ్యాకర్ గ్రూప్ ఆధ్వర్యాన మొదట ఇజ్రాయెల్ లోని భారత దౌత్యకార్యాలయం సైట్ సహా , ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈ-పోర్టల్ వంటి వివిధ ఆన్ లైన్ వేదికలను ఈ గ్రూప్ తన టార్గెట్లుగా చేసుకుంది.
దాదాపు 70 వెబ్ సైట్లను ఇది హ్యాక్ చేసిందట.. వీటిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భవాన్స్ గ్రూప్ వంటివాటితో బాటు పలు ప్రముఖ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 50 వెబ్ సైట్లలో ఈ హ్యాకర్ గ్రూప్ చొరబడింది. ఈ బెడదను ఎలా ఎదుర్కోవాలో తెలియక సైబర్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. హ్యాకర్లు చొరబడుతున్నవైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. ..
ఆడియో క్లిప్పులు, మెసేజులను కూడా వీటిలో ‘పొందుపరుస్తున్నారంటే’ వారి టెక్నాలజీకి విస్తుపోవలసిందే ! ‘మీకు మీ మతమైతే, మాకు మతం’ అన్నది వీటిలోని ప్రధాన స్లోగన్ ! ఇండియాపై విషప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండవలసిందిగా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్లను, మానవ హక్కుల సంఘాలను యాక్టివిస్టులను కూడా కోరుతున్నారు. ఈ నెల 8-12 తేదీల మధ్య ఈ సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. డ్రాగన్ ఫోర్స్ మలేసియా అనే ఈ హ్యాకర్ల గ్రూపులో 13 వేలమందికి పైగా సభ్యులున్నారని తెలిసి సెక్యూరిటీ నిపుణులు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
ఈ హ్యాకర్ల సంస్థ ఇండియాలోని ఓ పాపులర్ బ్యాంక్ సైట్ లోకి చొరబడేందుకు కూడా యత్నించిందట. అయితే బ్యాంకర్ల అప్రమత్తతతో ఈ ముప్పు తప్పింది. ఇజ్రాయెల్ లోని ఇండియన్ ఎంబసీ సైట్ ని నిన్నటికి పునరుద్దరించినప్పటికీ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇప్పటికీ ‘హ్యాకర్ల అధీనం’ లోనే ఉన్నట్టు సమాచారం.
ఇక ‘1877’ అనే మరో గ్రూపు మహారాష్ట్రలోని ‘మహారాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ’ సహా మరికొన్ని పోర్టల్స్ ని హ్యాక్ చేసింది. భారత ప్రజలతో తమకెలాంటి సమస్య లేదని, తమ మతాన్ని ఎంపిక చేసుకునే హక్కు వారికి ఉందని, కానీ ఇస్లాం మీద దాడి జరిపితే మాత్రం సహించేది లేదని ఈ గ్రూప్ హెచ్చరించింది. అలాగే మహారాష్ట్రలోని పలు కాలేజీలపై కూడా ఈ గ్రూపు హ్యాకర్లు కన్నేశారు.
ఆగ్నేయాసియా దేశాలతో దౌత్య సంబంధాలా ?
డ్రాగన్ ఫోర్స్ హ్యాకర్లు మామూలోళ్లు కాదు ! గత ఏడాది జూన్, జులై నెలల మధ్య కూడా వీళ్ళు ఇజ్రాయెలీ ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడులు చేశారు. అవసరమైతే మేం ఆగ్నేయాసియా ముస్లిం దేశాలతో కూడా డిప్లొమాటిక్ సంబంధాలు పెట్టుకోగలమని వాళ్ళు సవాల్ చేశారు. డేటా థెఫ్ట్ (డేటా చౌర్యం) మాకు కొత్తేమీ కాదు.. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయడానికి వెనుకాడం అని వీరు హెచ్చరించారట. బ్యాంకింగ్, అతి కీలకమైన సంస్థల సైట్లలోకి అవలీలగా చొరబడే శక్తి మాకుంది అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటిని తేలిగ్గా తీసిపారేయకండి అని స్పష్టం చేశారని కూడా తెలుస్తోంది. డ్రాగన్ గ్రూప్ అన్న పేరిట బహుశా చైనా లేదా మలేసియా నుంచే హ్యాకర్లు ఈ ‘దందా ‘ సాగిస్తున్నారని సమాచారం !
ఇండియా, సైబర్ దాడులు, నూపుర్ శర్మ, అల్-ఖైదా, డ్రాగన్ ఫోర్స్ ఆఫ్ మలేసియా, భారత ప్రభుత్వ పోర్టల్స్, హ్యాక్,
First Published:  13 Jun 2022 9:06 AM GMT
Next Story