Telugu Global
National

ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత్ లోని 70 ప్రభుత్వ, ప్రైవేటు సైట్లపై హ్యాకర్ల దాడి

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్ కు చెందిన 70 ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ సైట్లు హ్యాక్ కు గురయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ డ్రాగన్‌ఫోర్స్ భారత దేశవ్యాప్తంగా వివిధ వెబ్ సైట్లపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, ఇండియన్ కౌన్సిల్ […]

hacking
X

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్ కు చెందిన 70 ప్రభుత్వ, ప్రైవేటు వెబ్ సైట్లు హ్యాక్ కు గురయ్యాయి.

మలేషియాకు చెందిన హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ డ్రాగన్‌ఫోర్స్ భారత దేశవ్యాప్తంగా వివిధ వెబ్ సైట్లపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఇ-పోర్టల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

మొత్తం మీద ఈ గ్రూప్ దాదాపు 70 వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్ తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాలలు,ప్రముఖ విద్యాసంస్థలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్క మహారాష్ట్రలోనే 50కి పైగా వెబ్‌సైట్‌లు ధ్వంసమైనట్లు గుర్తించారు.

ఈ హ్యాకర్లు ఆడియో క్లిప్పులు, టెక్స్ట్‌ల ద్వారా,ఓ సందేశాన్ని కూడా పంపారు. “మీ కోసం మీ మతం మాకు మా మతం”. అని సందేశం పంపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌ను ఆదివారం నాటికి భారత అధికారులు పునరుద్ధరించగలిగారు, అయితే ICAR పేజీలలో ఒకటి ఇప్పటికీ పునరుద్దరించలేకపోయారు. .

First Published:  13 Jun 2022 12:13 AM GMT
Next Story