Home > ప్రవక్త పై మరో వివాదం… ‘ది లేడీ ఆఫ్ హెవెన్’ మూవీపై నిరసనలు
Homeప్రవక్త పై మరో వివాదం… ‘ది లేడీ ఆఫ్ హెవెన్’ మూవీపై నిరసనలు
ప్రవక్త పై మరో వివాదం… ‘ది లేడీ ఆఫ్ హెవెన్’ మూవీపై నిరసనలు
బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా సమిసిపోక ముందే బ్రిటన్ లో మరో వివాదం రాజుకుంది. బ్రిటిష్ చిత్రం ‘ది లేడీ ఆఫ్ హెవెన్‘ పై వివాదం చెలరేగింది. ఇది దైవ దూషణ , జాత్యాహంకారం అంటూ ముస్లింలు బ్రిటన్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జూన్ 3న రిలీజ్ అయిన ఈ మూవీ నిరసనల కారణంగా అనేక థియేటర్లలోంచి తొలగించబడింది. 1కోటి 50 లక్షల డాలర్లతో […]
BY sarvi12 Jun 2022 4:58 AM IST

X
sarvi Updated On: 12 Jun 2022 5:55 AM IST
బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా సమిసిపోక ముందే బ్రిటన్ లో మరో వివాదం రాజుకుంది. బ్రిటిష్ చిత్రం ‘ది లేడీ ఆఫ్ హెవెన్‘ పై వివాదం చెలరేగింది. ఇది దైవ దూషణ , జాత్యాహంకారం అంటూ ముస్లింలు బ్రిటన్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
జూన్ 3న రిలీజ్ అయిన ఈ మూవీ నిరసనల కారణంగా అనేక థియేటర్లలోంచి తొలగించబడింది. 1కోటి 50 లక్షల డాలర్లతో నిర్మించిన ఈ మూవీ అమెరికా, కెనడా, బ్రిటన్ లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి వ్యతిరేకంగా ‘చేంజ్ డాట్ ఆర్గ్’ లో ఆన్ లైన్ పిటిషన్ మీద 1లక్షా 28 వేల మంది సంతకాలు చేశారు.
ఈ నిరసనల నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సినిమా చైన్ బ్రిటిష్ సినిమా కంపెనీ ‘సినీవరల్డ్’ బ్రాడ్‌ఫోర్డ్, లీడ్స్, షెఫీల్డ్, బోల్టన్, బ్లాక్‌బర్న్, బర్మింగ్‌హామ్‌తో సహా అనేక నగరాల్లో ఈ చలనచిత్రం ప్రదర్శనలను రద్దు చేసింది.
కాగా ఈ మూవీ మహ్మద్ ప్రవక్త కూతురు ఫాతిమా అల్-జహ్రాను మొదటి ఉగ్రవాద బాధితురాలిగా చిత్రీకరించింది. షియా మతాధికారి షేక్ యాసర్ అల్-హబీబ్ రాసిన ‘ది లేడీ ఆఫ్ హెవెన్’ మూవీకి ఎలి కింగ్ దర్శకత్వం వహించారు. యుద్ధంలో తన తల్లిని కోల్పోయిన ఇరాకీ పిల్లల కథను ఈ మూవీ వివరిస్తుంది. తల్లిని కోల్పోయిన అమ్మాయి లేడీ ఫాతిమా నుండి ప్రేరణ పొంది ధైర్యం, ఓపిక వంటి అనేక పాఠాలను ఎలా నేర్చుకుంటుంది అనేదే కథ.
ఈ సినిమాలో లేడీ ఫాతిమా, మహ్మద్ ప్రవక్తను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. మహ్మద్ ప్రవక్తను ఆర్ట్ రూపంలో చూపించకూడదని ముస్లింలు భావిస్తారు. దీంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.
కాగా సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాలిక్ ష్లిబాక్ ‘స్కై న్యూస్’తో మాట్లాడుతూ, ప్రజలు సినిమాను విమర్శించవచ్చు, కానీ నిరసనలు “హద్దులు దాటిపోయాయి” అని ఆరోపించారు.
మరో వైపు ఇది జాత్యాహంకార చిత్రమని, మహ్మద్ ప్రవక్తను, అతని అనుచరులను చెడుగా చిత్రీకరించిందని మహ్మద్ ప్రవక్తను అవమానపర్చిందని ఆన్ లైన్ పిటిషన్ విమర్షించింది.
అయితే వ్యూ వంటి ఇతర సినిమా చైన్‌లు ఈ చిత్రాన్ని లండన్‌లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాయి.
మరో వైపు ఈ మూవీకి మద్దతుగా చేంజ్ డాట్ ఆర్గ్ లో కొందరు మరో పిటిషన్ కూడా పోస్ట్ చేశారు. ఆ పిటిషన్ పై ఇప్పటి వరకు 4,000 మంది సంతకాలు చేశారు. “లేడీ ఆఫ్ హెవెన్ సినిమాకు మద్దతు ఇవ్వండి!” అని ప్రజలను ఆ పిటిషన్ లో కోరారు.

Like
Comment
Next Story