మళ్లీ బైబిల్ వాక్యం చెప్పిన పవన్.. ఈసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు
తనను తాను తగ్గించుకునువారు హెచ్చింపబడుదురు అంటూ ఇటీవల పొత్తుల విషయంలో 3 ఆప్షన్లు చెప్పి చివర్లో ఈ బైబిల్ వాక్యం చెప్పారు పవన్ కల్యాణ్. 2014, 2019లో తనను తాను ప్రజల కోసం తగ్గించుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇంకో బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించారు. సామెతలు 12:22 “అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.” అంటూ ఈసారి ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు […]
తనను తాను తగ్గించుకునువారు హెచ్చింపబడుదురు అంటూ ఇటీవల పొత్తుల విషయంలో 3 ఆప్షన్లు చెప్పి చివర్లో ఈ బైబిల్ వాక్యం చెప్పారు పవన్ కల్యాణ్. 2014, 2019లో తనను తాను ప్రజల కోసం తగ్గించుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇంకో బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించారు.
సామెతలు 12:22
“అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.” అంటూ ఈసారి ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు పవన్ కల్యాణ్. సడన్ గా పవన్ కల్యాణ్ ఇలా బైబిల్ వాక్యాలను కోట్ చేస్తూ స్టేట్ మెంట్లు ఇవ్వడం జనసైనికులకు కూడా అర్థం కాని వ్యవహారంలా మారింది.
మద్యనిషేధంపై చెణుకులు..
2019 ఎన్నికల ప్రచారంలో మద్యనిషేధం హామీని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు జగన్. అయితే అధికారంలోకి వచ్చాక విడతల వారీగా మద్య నిషేధం చేస్తామన్నారు. కానీ మూడేళ్లవుతున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరిగలేదనేమాట వాస్తవం. వైసీపీ నాయకులు ఏ ప్రశ్నకయినా సమాధానం చెప్పగలరు కానీ, మద్య నిషేధం మాట ఏమైంది అంటే మాత్రం కాస్త చిన్నబుచ్చుకుంటారు. ఏపీలో మద్యాన్ని నిషేధించకపోగా.. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్. మద్యం ఆదాయాన్ని పూచీకత్తుగా పెట్టి 8వేల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం సమీకరించిందనే వార్తను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఇలా ట్వీట్ చేశారు.
“సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..” అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.