Telugu Global
National

పతంజలి తప్పుడు ప్రచారాలకు బ్రేక్.. ఆ ప్రకటనలు వెనక్కి..

పతంజలి మందులతో షుగర్, గుండెపోటు, లివర్ వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటూ కేరళలోని కోజికోడ్ లో దివ్య ఫార్మసీ భారీస్థాయిలో ప్రకటనలు గుప్పించింది. పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టింది, టీవీలు, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం అంటూ తప్పుడు ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్ధం. దీనిపై కేవీ బాబు అనే ఓ కంటి డాక్టర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాతోపాటు, ఆయుష్ మంత్రిత్వ శాఖకు కూడా […]

పతంజలి తప్పుడు ప్రచారాలకు బ్రేక్.. ఆ ప్రకటనలు వెనక్కి..
X

పతంజలి మందులతో షుగర్, గుండెపోటు, లివర్ వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటూ కేరళలోని కోజికోడ్ లో దివ్య ఫార్మసీ భారీస్థాయిలో ప్రకటనలు గుప్పించింది.

పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టింది, టీవీలు, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం అంటూ తప్పుడు ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్ధం. దీనిపై కేవీ బాబు అనే ఓ కంటి డాక్టర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాతోపాటు, ఆయుష్ మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేరింది. ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేరగా.. తాజాగా ఆ ప్రకటనలు నిలిపివేయాలంటూ ఆయుష్ శాఖ ఆదేశాలిచ్చింది.

వారంలో కొలెస్ట్రాల్‌ తగ్గించేస్తాం, గుండె సమస్యలు, రక్తపోటు కూడా పూర్తిగా తగ్గిపోతుంది, మా ఆయుర్వేద మందు వాడితే నెలరోజుల్లో షుగర్ వ్యాధి మటుమాయం అవుతుంది. లివర్ వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్నవారు కూడా మా మాత్రలు తీసుకుంటే నెలరోజుల్లో లేచి కూర్చుంటారంటూ.. పతంజలి ప్రోడక్ట్స్ గురించి దివ్య ఫార్మసీ ప్రచారం మొదలు పెట్టింది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం -1954 ప్రకారం ఇలాంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు సమాచార పంపిణీ చట్ట విరుద్ధం. ఈ చట్టం ప్రకారం ఆ ప్రకటనలు నిషేధించాలంటూ కేవీ బాబు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే అంత తొందరగా ఆయుష్ శాఖ ఈ ఉత్తర్వులు ఇవ్వలేదు.

పతంజలితో వ్యవహారం కావడంతో చాలా కాలం ఈ వ్యవహారం నానుతూనే ఉంది. చివరకు ఆర్టీఐ ద్వారా తన ఫిర్యాదు వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటూ మరోసారి డాక్టర్ కేవీబాబు ఆరా తీశారు. దీంతో హడావిడిగా ఆయుష్ శాఖ ఉత్తర్వులిచ్చింది.

కరోనిల్ పై కూడా ఇలాగే నిషేధం..
గతంలో కరోనా విజృంభణ సమయంలో కూడా పతంజలి కరోనిల్ అనే ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తెచ్చింది. దీని ద్వారా కరోనా పూర్తిగా తగ్గిపోతుందంటూ ప్రచారం చేసింది. ఆరోపణలు రావడంతో.. తమ ఉత్పత్తి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటూ మాట మార్చింది.

అయితే కరోనిల్ అనే పేరుపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పతంజలి యాజమాన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు షుగర్, గుండెపోటు, లివర్ వ్యాధుల్ని నయం చేస్తామంటూ రూపొందించిన ప్రకటనలపై ఆయుష్ శాఖ నిషేధం విధించింది.

First Published:  12 Jun 2022 11:02 AM GMT
Next Story