Telugu Global
National

ఫేక్ సత్యాగ్రహాలు.. గాంధీ కుటుంబంపై బీజేపీ కారాలు మిరియాలు

బూటకపు గాంధీల కుటుంబం బూటకపు (ఫేక్) సత్యాగ్రహాలకు దిగుతోందని బీజేపీ మండిపడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సత్యాగ్రహం చేయాలని పార్టీ శ్రేణులకు నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని, పలు నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టాలని సూచించింది. అయితే ఇదంతా ఏమిటని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా […]

ఫేక్ సత్యాగ్రహాలు.. గాంధీ కుటుంబంపై బీజేపీ కారాలు మిరియాలు
X

బూటకపు గాంధీల కుటుంబం బూటకపు (ఫేక్) సత్యాగ్రహాలకు దిగుతోందని బీజేపీ మండిపడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సత్యాగ్రహం చేయాలని పార్టీ శ్రేణులకు నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని, పలు నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టాలని సూచించింది.

అయితే ఇదంతా ఏమిటని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా ప్రశ్నించారు. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేత రాహుల్ గాంధీ ఇద్దరూ బెయిల్ పై ఉన్నారని, రాహుల్ సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరు కావలసి ఉందని, కానీ ఆ పార్టీ పెద్ద డ్రామా చేస్తోందని ఆయన ఆరోపించారు. వాళ్ళు తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఢిల్లీకి రావాలని ఆహ్వానిస్తున్నారని, ఈ డ్రామా వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన అన్నారు. ‘దిగ్విజయ్ సింగ్ వంటివారు ప్రెస్ కాన్ఫరెన్సులు పెడితే ఉపయోగం ఉందా ? రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరై తాను చేసిన తప్పిదాలను ఏకరువు పెట్టాల్సిందే.. ఇక సత్యాగ్రహం ఎందుకు ? ఫేక్ గాంధీ కుటుంబాల ఫేక్ సత్యాగ్రహాలు చూసి గాంధీజీ సిగ్గుతో తలవంచుకుంటారు’ అని పాత్రా ఆవేశంగా వ్యాఖ్యానించారు.

రాహుల్ తప్పించుకోవడానికి యత్నించరాదని, ఇది లీగల్ సమస్య అని, రాజకీయ సమస్య కాదని ఆయన అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నందుకు నిరసనగా సోమవారం ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించాలని, సత్యాగ్రహానికి కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు, కార్యకర్తలకు సూచించింది. రాహుల్ కి మొదట ఈ నెల 2 న హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసినా.. తాను విదేశాల్లో ఉన్నందున హాజరు కాలేనని, మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరడంతో.. ఈ నెల 13 కి తేదీని ఈడీ వాయిదా వేసింది. సోనియా గాంధీ కూడా ఈ నెల 8 న అటెండ్ కావలసి ఉన్నప్పటికీ, కోవిడ్ బారిన పడడంతో.., ఆమె ఈనెల 23 న హాజరు కావాలని తాజాగా సమన్లు పంపారు.

కోవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
కోవిడ్ కి సంబంధించిన సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితినిలకడగా ఉందని, ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేసిన పార్టీ నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. సోనియా రొటీన్ మెడికల్ చెకప్ కోసం ఈ హాస్పిటల్ కి వచ్చారని, ఆమెను డాక్టర్లు పరీక్షించారని పార్టీవర్గాలు తెలిపాయి.

First Published:  12 Jun 2022 11:27 AM IST
Next Story