Telugu Global
NEWS

నారా అంటే నాసిరకం రాజకీయం.. కొత్త అర్థం చెప్పిన విజయసాయి

నారా అంటే నాసిరకం రాజకీయం, చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని, సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెద్ద సవాల్ అని, సీబీఐ వెనక్కు తగ్గితే ఇక ప్రజల్ని కాపాడేదెవరంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసుల వల్ల కావడంలేదు, సీబీఐ అయినా శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు చంద్రబాబు. దీనికి ట్విట్టర్లో కౌంటర్ […]

నారా అంటే నాసిరకం రాజకీయం.. కొత్త అర్థం చెప్పిన విజయసాయి
X

నారా అంటే నాసిరకం రాజకీయం, చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని, సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెద్ద సవాల్ అని, సీబీఐ వెనక్కు తగ్గితే ఇక ప్రజల్ని కాపాడేదెవరంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసుల వల్ల కావడంలేదు, సీబీఐ అయినా శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు చంద్రబాబు. దీనికి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. గతంలో సీబీఐకి ఏపీలో ఎంట్రీ లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారంటూ రెండు నాల్కలతో నాసిరకం రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ ట్వీట్ చేశారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు – ఈ అవకాశవాది దినచర్య అంటూ మండిపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు తెరవండి..

మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదంపై కూడా స్పందించారు విజయసాయిరెడ్డి. “మంగళగిరిలో ఏం ఖర్మ, నీవు దోచుకున్న లక్షల కోట్లతో 100 ఏళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు దొంగ బాబూ. పదేళ్లపాటు ఫ్రీగా భోజనాలు పెట్టినా నీ సంపద ఉల్లి పొట్టంత కూడా తరగదు. 2 ఎకరాల నుంచి 5 లక్షల కోట్లు ఎలా సంపాదించావో జాతీయ మీడియా ఎప్పుడో ఆధారాలతో సహా రాసింది.” అంటూ ట్వీట్ చేశారు.

అయ్యన్నకు యథావిధిగా వడ్డింపు..

ఇటీవల కాలంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ట్విట్టర్లో ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు విజయసాయిరెడ్డి. తాజాగా.. అయ్యన్నను అదుపులో పెట్టుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. “ర్యాబిస్ ముదిరిపోయిన పిచ్చి కుక్క గంజాయి పాత్రుడుని కాస్త అదుపులో పెట్టుకో చంద్రం. నువ్వు ఉస్కో అనగానే ఎవరిని పడితే వారిని కరవడానికి ఉరుకుతున్నాడు. గట్టిగా తరిమితే చివరకు నీ పిక్క పట్టి పీకుతాడు. ర్యాబిడ్ డాగ్స్ యజమానిని సరిగా గుర్తించలేవు. గొలుసుతో కట్టేసి మీదకు రాకుండా చూసుకో.” అంటూ అయ్యన్నపై హాట్ కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి.

First Published:  11 Jun 2022 11:56 AM IST
Next Story