కామెడీ సినిమాలు మరిన్ని రావాలి
ప్రస్తుతం యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమాలదే హవా అంటున్నారు సీనియర్ నటుడు నరేష్. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నరేష్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత బిజీ అయ్యారు. కామెడీ పాత్రలు మరిన్ని పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన అంటే సుందరానికీ సినిమాలో కామెడీ రోల్ పోషించిన నరేష్.. మరిన్ని కామెడీ చిత్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. “కామెడీ సినిమాలు గతంలో జంథ్యాల, వంశీ, రేలంగి నరసింహారావు చిత్రాలు వచ్చాయి. […]
ప్రస్తుతం యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమాలదే హవా అంటున్నారు సీనియర్ నటుడు నరేష్. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నరేష్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత బిజీ అయ్యారు. కామెడీ పాత్రలు మరిన్ని పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన అంటే సుందరానికీ సినిమాలో కామెడీ రోల్ పోషించిన నరేష్.. మరిన్ని కామెడీ చిత్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
“కామెడీ సినిమాలు గతంలో జంథ్యాల, వంశీ, రేలంగి నరసింహారావు చిత్రాలు వచ్చాయి. ఇవాళ నేటి ఆడియన్స్ పల్స్ బట్టి సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమాకు రచయిత, దర్శకుడు ఒక్కరే. దానివల్ల మంచి సినిమాలు వచ్చేవి. దర్శకుడు, రచయిత వేరు వేరు అయితే సరిగ్గా తీయడం కష్టం. మరలా ఇప్పుడు పాత రోజులు మాదిరే రచయిత, దర్శకుడు ఒక్కరే అయ్యేలా యంగ్ దర్శకులు రావడం ఆనందంగా వుంది. అయితే కామెడీ సినిమాలు రాయడం కష్టం. తీయడం మరీ కష్టం. నటీనటులు కుదరడం మరింత కష్టం. ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులున్నారు. వారంతా టైమింగ్ ఉన్న వారే. అదే అంటే సుందరానికి సినిమాకు ప్లస్ అయింది.”
మారుతి తీసిన ప్రేమకథాచిత్రమ్ సినిమా నుంచి టాలీవుడ్ లో కామెడీ చిత్రాల హవా మొదలైందని చెబుతున్నారు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా నటించి అలా వెళ్లిపోవడం కాకుండా.. ఆ పాత్ర కోసం మేకోవర్ అవుతుంటానని చెబుతున్నారు నరేష్. తన మొహం చూసి తనకే బోర్ కొట్టకూడదని, అందుకే ప్రతి పాత్రకు కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.