Telugu Global
National

మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఈసారి 8వేలు దాటాయి

భారత్ లో మళ్లీ కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులపాటు 7వేలకు పైగా నమోదైన కేసులు గడచిన 24 గంటల్లో మరో వెయ్యి పెరిగాయి. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 8,329మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మళ్లీ కరోనా కేసుల భయం వెంటాడుతోంది. 10వేల మార్కు దాటితే మాత్రం దేశవ్యాప్తంగా మరోసారి హై అలర్ట్ ప్రకటించే అవకాశముంది. ఫోర్త్ వేవ్ కి సంకేతమేనా..? ఫస్ట్ వేవ్ లెక్క […]

corona-daily-cases-rise
X

భారత్ లో మళ్లీ కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులపాటు 7వేలకు పైగా నమోదైన కేసులు గడచిన 24 గంటల్లో మరో వెయ్యి పెరిగాయి. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 8,329మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మళ్లీ కరోనా కేసుల భయం వెంటాడుతోంది. 10వేల మార్కు దాటితే మాత్రం దేశవ్యాప్తంగా మరోసారి హై అలర్ట్ ప్రకటించే అవకాశముంది.

ఫోర్త్ వేవ్ కి సంకేతమేనా..?

ఫస్ట్ వేవ్ లెక్క తప్పలేదు, సెకండ్, థర్డ్ వేవ్ లను కూడా కచ్చితంగానే అంచనా వేశారు వైద్య నిపుణులు. అయితే ఫోర్త్ వేవ్ విషయంలోనే అంచనాలు తారుమారవుతున్నాయి. నెలరోజుల క్రితం ఓసారి కరోనా కేసులు పెరిగాయి, ఆ తర్వాత వెంటనే తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. అయితే దీన్ని ఫోర్త్ వేవ్ కి సంకేతం అనుకోవాలా వద్దా అనేది మాత్రం తేల్చలేకపోతున్నారు నిపుణులు.

క్రమక్రమంగా పెరుగుదల..

2వేలు, 3 వేలు, 4 వేలు, ఆ తర్వాత వరుసగా రెండు రోజులపాటు 7వేల మార్కు దాటిన కొవిడ్ కేసులు ఇప్పుడు 8వేలకు పైబడ్డాటయి. దీంతో సహజంగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అంతే కాదు, 24గంటల్లో కరోనా కారణంగా 10మరణాలు సంభవించడం కూడా మరింత ఆందోళన కలిగించే విషయం. డిశ్చార్జిల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కొవిడ్ సోకిన వారి సంఖ్య 8329 కాగా, ఒకరోజు వ్యవధిలో డిశ్చార్జి అయినవారి సంఖ్య 4216.

మహారాష్ట్ర, కేరళ..

ఈసారి మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 65శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాలనుంచే వచ్చాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 3081 మందికి పాజిటివ్‌ రాగా, కేరళలో 2415 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. ఢిల్లీ-655, కర్నాటక-525, హర్యానా-327 స్కోర్లు కూడా కలవరపెట్టేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.21 శాతం కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు భారత్ లో 1,94,92,71,111 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  11 Jun 2022 11:11 AM IST
Next Story