గంజాయిని చట్టబద్దం చేసిన మొట్టమొదటి ఆసియా దేశం
గంజాయి సేవనానికి, అమ్మకానికి, పండించడానికి వ్యతిరేకంగా మనదేశంలో గట్టి చట్టాలున్నాయి. మనదేశమే కాకుండా ఆసియా దేశాలన్ని గంజాయిపై ఉక్కుపాదమే మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా దేశమైన థాయ్‌లాండ్‌లో గంజాయి చట్టబద్దం చేయబడింది. థాయ్‌లాండ్‌లో గంజాయి పెంపకం, సేవనం చట్టవ్యతిరేకంకాదని గురువారం ప్రకటించింది. పురాణ థాయ్ స్టిక్ రకమైన గంజాయి అందించిన కిక్‌ను ఇప్పటికీ గుర్తుచేసుకునే వృద్ధాప్య తరం గంజాయి స్మోకర్ల కల నిజమైంది. గంజాయి సాగు కోసం పది లక్షల మొక్కలను పంపిణీ చేయాలని దేశ ప్రజారోగ్య […]
గంజాయి సేవనానికి, అమ్మకానికి, పండించడానికి వ్యతిరేకంగా మనదేశంలో గట్టి చట్టాలున్నాయి. మనదేశమే కాకుండా ఆసియా దేశాలన్ని గంజాయిపై ఉక్కుపాదమే మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా దేశమైన థాయ్‌లాండ్‌లో గంజాయి చట్టబద్దం చేయబడింది.
థాయ్‌లాండ్‌లో గంజాయి పెంపకం, సేవనం చట్టవ్యతిరేకంకాదని గురువారం ప్రకటించింది. పురాణ థాయ్ స్టిక్ రకమైన గంజాయి అందించిన కిక్‌ను ఇప్పటికీ గుర్తుచేసుకునే వృద్ధాప్య తరం గంజాయి స్మోకర్ల కల నిజమైంది.
గంజాయి సాగు కోసం పది లక్షల మొక్కలను పంపిణీ చేయాలని దేశ ప్రజారోగ్య మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు. ఇది థాయ్‌లాండ్ ను వండర్‌ల్యాండ్‌గా మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం.. దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, 60 వేల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.