శివసేన కు MIM మద్దతు… రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే
రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందనేది మనం అనేక సార్లు చూశాం. శత్రువులు మిత్రులై పోతారు మిత్రులు శత్రువులై పోతారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. మహారాష్ట్ర లో తన బద్ద శత్రువైన శివసేనకు MIM మద్దతుగా నిలవబోతుంది. ఇవ్వాళ్ళ జరిగే రాజ్య సభ ఎన్నికల్లో శివసేన కూటమి అయిన మహా వికాస్ అఘాడీ తరపున నిలబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి షాయర్ ఇమ్రాన్ కు MIM ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఔరంగాబాద్‌కు చెందిన ఎఐఎంఐఎం లోక్‌సభ […]
రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందనేది మనం అనేక సార్లు చూశాం. శత్రువులు మిత్రులై పోతారు మిత్రులు శత్రువులై పోతారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. మహారాష్ట్ర లో తన బద్ద శత్రువైన శివసేనకు MIM మద్దతుగా నిలవబోతుంది. ఇవ్వాళ్ళ జరిగే రాజ్య సభ ఎన్నికల్లో శివసేన కూటమి అయిన మహా వికాస్ అఘాడీ తరపున నిలబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి షాయర్ ఇమ్రాన్ కు MIM ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు.
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఔరంగాబాద్‌కు చెందిన ఎఐఎంఐఎం లోక్‌సభ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ ఈ విషయాన్ని ప్రకటించారు..
“మా ఇద్దరు AIMIM ఎమ్మెల్యేలు శివసేన కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము! BJPని ఓడించడానికి, మా పార్టీ మహా వికాస్ అఘాడి (MVA)కి ఓటు వేయాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో మా రాజకీయ/సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతాయి” అని జలీల్ ట్వీట్ చేశారు.
ఈరోజు పోలింగ్ జరుగుతున్న మహారాష్ట్ర నుండి ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.