Telugu Global
National

బీజేపీ ఎమ్మెల్యే కూతురు.. నడిరోడ్డులో రెచ్చిపోయింది..

కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు నడిరోడ్డులో రెచ్చిపోయింది. బెంగళూరు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా.. జరిమానా విధించిన పోలీసులతో గొడవ పడింది. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్ట్ చెంప పగలగొట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావాలి కూతురు బెంగళూరు రోడ్లపై ఓవర్ స్పీడ్ తో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆమెను ఆపి జరిమానా విధించారు. తాను ఎమ్మెల్యే […]

bjp-karnataka-mla-daughter
X

కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు నడిరోడ్డులో రెచ్చిపోయింది. బెంగళూరు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా.. జరిమానా విధించిన పోలీసులతో గొడవ పడింది. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్ట్ చెంప పగలగొట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావాలి కూతురు బెంగళూరు రోడ్లపై ఓవర్ స్పీడ్ తో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆమెను ఆపి జరిమానా విధించారు. తాను ఎమ్మెల్యే కూతురునంటూ ఆమె అక్కడ హంగామా సృష్టించింది. ఫైన్ కట్టనంటూ మొండికేసింది, తన కారుకే ఫైన్ వేస్తారా అంటూ రంకెలేసింది. ఈ హడావిడితో జనం గుమికూడారు. ఓ జర్నలిస్ట్ ఆ సంఘటనను వీడియో తీస్తుండగా.. ఎమ్మెల్యే కూతురు అడ్డుకుంది. కెమెరా లాక్కొని, జర్నలిస్ట్ ని చెంపదెబ్బ కొట్టింది. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నా కూతురు తప్పు చేయదు..

ఇంత జరిగినా ఎమ్మెల్యే అరవింద్ తన కుమార్తెను వెనకేసుకు రావాలని చూస్తున్నారు. ఆమె తప్పేమీ లేదని, అసలా సమయంలో కారు నడిపింది ఆమె కాదని చెబుతున్నారు. కానీ సీసీ ఫుటేజీ ఆధారంగా కారుని ఎమ్మెల్యే కుమార్తె నడిపినట్టు తెలుస్తోంది. కానీ ఎమ్మెల్యే మాత్రం కావాలనే తన కుమార్తెకు ఫైన్ వేశారని, చెబుతున్నారు.

అందర్ని ఇలాగే టార్గెట్ చేస్తారా..?

కేవలం ఎమ్మెల్యే కుమార్తె కావడం వల్లే తన కూతురిని పోలీసులు, మీడియా టార్గెట్ చేశారని అంటున్నారు అరవింద్. బెంగళూరులో రోజుకి ఇలాంటి సంఘటనలు 100కి పైగా జరుగుతుంటాయని, అందరికీ ఫైన్ వేసి వదిలేస్తున్నారని, కానీ తన కూతురిని వీడియో తీయాలని చూశారని ఆరోపిస్తున్నారాయన. తన కూతురు తప్పు లేదని, తప్పు చేయదని సమర్థించుకుంటున్నారు. ఎమ్మెల్యే అరవింద్ కుమార్తె ఓవర్ యాక్షన్ ఇప్పుడు కర్నాటకలో చర్చనీయాంశమైంది. వీఐపీల పిల్లలు కొంతమంది ఓవర్ స్పీడ్ తో వెళ్తుంటారు. చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు అదృష్టమేంటంటే.. అలా ఓవర్ స్పీడ్ తో యాక్సిడెంట్ కాకమునుపే పోలీసులు ఆ కారుని పట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం కూతురిని సమర్థిస్తూ తప్పంతా పోలీసులపై నెట్టేశారు.

First Published:  10 Jun 2022 6:51 AM IST
Next Story