అనారోగ్యంతోనే మిథాలీ ఆట నుంచి తప్పుకుందా?
ప్రఖ్యాత మహిళా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు ఇండియా జట్టు తరఫున ఆడారు. అత్యధిక వరల్డ్ కప్ లు ఆడిన మహిళా క్రికెటర్ గా మిథాలీ రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ వయసు 40 లోపే. కానీ, ఆమె ఆటలోకానీ, కెప్టెన్సీ నిర్వహణలో కానీ ఆమె వయసు ప్రభావం ఏమాత్రం కనిపించదు. 2022 ప్రపంచకప్ […]
ప్రఖ్యాత మహిళా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు ఇండియా జట్టు తరఫున ఆడారు. అత్యధిక వరల్డ్ కప్ లు ఆడిన మహిళా క్రికెటర్ గా మిథాలీ రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ వయసు 40 లోపే. కానీ, ఆమె ఆటలోకానీ, కెప్టెన్సీ నిర్వహణలో కానీ ఆమె వయసు ప్రభావం ఏమాత్రం కనిపించదు. 2022 ప్రపంచకప్ ఆటతీరే అందుకు సాక్ష్యం. అలాంటి మిథాలీ ఉన్నట్లుండి ఎందుకు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిందనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీసింది. మిథాలీకి తీవ్ర ఇబ్బందికరమైన అనారోగ్య సమస్య వెల్లడైందని, అందుకే ఆమె ఇకపై క్రికెట్‌కు న్యాయం చేయలేనని నిర్ధారించుకుని రిటైర్‌మెంట్ ప్రకటించిందని, ఆమెకు బాగా సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. ఈ విషయాన్ని మిథాలీ తల్లిదండ్రులు కూడా ఎంతో గోప్యంగా ఉంచారని అంటున్నారు. అనారోగ్యాన్ని జయించడానికి ఆమె ఆట నుంచి వైదొలగాల్సివస్తోందని ఆమె కుటుంబ సభ్యులు వారికి అత్యంత సన్నిహితుల వద్ద చెప్పినట్లు కూడా సమాచారం.
మిథాలీ, ఉమెన్ క్రికెట్ వండర్
మిథాలీ రాజ్ క్రికెట్ రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పురుషుల క్రికెట్‌లో సచిన్ రికార్డులకు ఎంత క్రేజ్ ఉందో, మహిళల క్రికెట్లో మిథాలీ రికార్డులకు అంత క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌ల్లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. సచిన్ 22 ఏళ్ల పాటు క్రికెట్ కు సేవలందిస్తే.. మిథాలీ ఏకంగా 23 సంవత్సరాలు పాటు ఈ ఆట ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక ఏళ్లు క్రికెట్ ఆడిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌గా చేశారు. ఇండియాను గెలిపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి మ్యాచ్‌లోనూ పట్టుదలతో ఆడినట్లు తన ట్వీట్‌లో మిథాలీ తెలిపారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా ఆమె పేరిట రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఇప్పటి వరకు 232 వన్డేల్లో టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి, 7,805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా నిలిచింది. 7 సెంచరీలు, 64 అర్ధ శతకాలు మిథాలీ సొంతం. కెరీర్ లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. ఇన్నాళ్లూ తన పట్ల ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించిన వారందరికీ ట్విట్టర్‌లో థ్యాంకూ చెప్పారు. మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు మిథాలీ తన ట్వీట్‌లో వెల్లడించారు.